DNS Media | Latest News, Breaking News And Update In Telugu

60 ఏళ్ళ వృద్ధ మహిళ కర్రసాము కు సోను సూద్ ఫిదా

*మహిళ చిరునామా చెప్పండి బాలికలకు శిక్షణ స్కూల్ పెట్టిస్తా* 

*బాలికలు, మహిళలు స్వీయ రక్షణలో శిక్షణ పొందాలి: సోను సూద్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* ఆకలి, దప్పిక తీర్చుకోడానికి ఒక వృద్ధ మహిళ నడిరోడ్డు పై చేసిన కర్రసాముకు ప్రముఖ

సామాజిక కార్యకర్త, సినీ నటుడు సోను సూద్ 
చలించి పోయాడు. సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యబడిన ఒక వీడియో లో 60 ఏళ్ళ వృద్ధ మహిళ కడుపు నింపుకోడానికి తనకు సాయం చెయ్యమని కోరుతూ. . .తన వద్ద ఉన్న రెండు కర్రలతోనూ సునాయాసంగా కర్ర సాము చేసింది. రోడ్డు పై వెళ్లే వారు తోచిన సాయం చేయడం మరింత కదిలించింది. 

చిరునామా

తెలియచేయండి : . .. 

ఈమె చిరునామా తెలియచేయండి, ఆమెతో కర్ర సాము, స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చే స్కూల్ పెట్టిస్తా, బాలికలకు, మహిళలకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తానంటూ తిరిగి పోస్ట్ పెట్టారు. 
ప్రస్తుత భారత దేశం లో బాలికలు, మహిళలు తప్పని సరిగా స్వీయ రక్షణ లో శిక్షణ పొందాలని తెలిపారు. 

కరోనా మహమ్మారి

వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు జరిగిన సమయంలో వేలాది మంది వలస కార్మికులకు నిత్యం ఆహారాన్ని అందించారు. ఈ క్రమం లో కొందరు తమ పరిస్థితి వివరించి, నడుచుకుంటూ వెళ్లడాన్ని చూసి తట్టుకోలేక దేశంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు, కొన్ని చోట్ల ప్రత్యేక విమానం సైతం ఏర్పాటు చేసి, దేశ ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు. 
/> ప్రస్తుతం అయన సినిమా నటునిగా కంటే స్వచ్చంద సమాజ సేవకునిగా ఖ్యాతి గాంచారు. ఈ నేపథ్యంలోనే ఈ వృద్ధ మహిళ కు తన వంతు సహకారం అందించే ప్రయత్నం లో ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam