DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిరోముండనం కేసులో కింగ్ పిన్ కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలి 

ఎస్సైని ప్రేరేపించిన వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి : వర్ల రామయ్య 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):*  తూ.గో జిల్లా సీతానగరం మండలంలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనానికి కారణమైన ప్రధాన నిందితుడు కవల కృష్ణమూర్తిని తక్షణ అరెస్ట్ చేసి డీజీపీ చిత్తశుద్ధిని

నిరూపించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేసారు. మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య కేసులో ఎవరో  ఫోన్ లో మాట్లాడారంటూ  మాజీ మంత్రి కోల్లు రవీంద్రను ఏ సాక్ష్యం లేకున్నా అరెస్ట్ చేశారు. సీతానగరంలో ఇసుక మాఫియాను ప్రశ్నించానన్న అక్కసుతో ఎస్సైపై ఒత్తిడి చేసి  శిరోముండనం చేయించారని దళిత

యువకుడు వరప్రసాద్ బహిరంగంగా చేసిన ప్రకటన ఆధారంగా కింగ్ పిన్ కృష్ణమూర్తి అరెస్ట్ చేయాలి. తనకు శిరోముండనం చేయాలని ఎస్సైకి పలు మార్లు ఫోన్ చేసి చెప్పింది కృష్ణమూర్తి మాత్రమేనని స్వయంగా బాధితుడు వరప్రసాద్ ప్రకటనకు వీడియో సాక్ష్యాలున్నాయి. అలాంటప్పుడు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడంలో తాత్సారం ఎందుకు ?

చేస్తున్నారన్నారు. 
వరప్రసాద్ ను తీవ్రంగా అవమానించి, అతనిపై దాడికి పాల్పడేలా స్థానిక ఎస్సైని ప్రలోభపెట్టిన కృష్ణమూర్తి ఎవరు? వైసీపీ నాయకులకు, ప్రభుత్వ పెద్దలు మూకుమ్మడిగా ఇసుక మాఫియాగా మారి అడ్డు వచ్చిన సామాన్యులపై పెట్రేగి అరాచకాలకు పాల్పడుతున్నారనడానికి ఈ కేసు ప్రబల తార్కాణం .  తన గ్రామంలో జరిగే ఇసుక

మాఫియాను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమా? వైసీపీ నేతల ప్రోద్భాలంతో శిరోముండనం చేసిన ఎస్సైని సస్పెండ్ తో సమస్య సమసిపోదు. తక్షణం అందుకు కారకులైన సీతానగరంలోని ఇసుక మాఫియా కింగ్ పిన్ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఇతరత్రా బాధ్యులను కూడా అదుపులోకి తీసుకోవాలన్నారు. 

సీతానగరంలో వరప్రసాద్ కు

జరిగిన అవమానం చూస్తుంటే ఏపీలో దళితులు నివసించలేని గడ్డుస్థితి నెలకొంది. పోలీసుల నిష్ఫక్షపాత దర్యాప్తుతో అసలైన నిందితుల అరెస్ట్ తో ఇకనైనా జగన్ నాయకత్వంలో దళితులపై పెరిగిన దాడులకు అడ్డుకట్ట పడతాయని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో అభద్రతా భావానికి లోనైనా దళితజాతికి ఆత్మశైర్య కలిగేలా డీజీపీ పకడ్బందీ చర్యలకు ఈ కేసుతో

నాంది పలకాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam