DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలియచేయడమే విజయ్ దివస్  

*కార్గిల్ యుద్ధం లో అమరులకు అఖండ భారతావని అఖండ నీరాజనం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 26, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాలకు భారత సైనిక సత్తా ప్రకటింపచేసినదే కార్గిల్ యుద్ధం. దీనిలో భారత్ సైనిక వీరులు తమ అసమాన ప్రతిభను ప్రకటించి, పాకిస్తాన్ ముష్కరులను తరిమి తరిమి

కొట్టిన రోజే జులై 26. దీన్నే విజయ్ దివస్ గా దేశం యావత్తు జరుపుకుంటున్నారు. ప్రధానంగా కార్గిల్ యుద్ధం లో అమరులకు అఖండ భారతావని అఖండ నీరాజనం పడుతోంది.  

భారత్ భూభాగంలోకి పాక్ సైన్యం : . . .

ఫిబ్రవరి 1999 లో పాకిస్తాన్ సైన్యం తన సైనిక స్ధావరాలను వెంటనే తిరిగి ఆక్రమించుకోవడమే కాక నియంత్రణ రేఖ దాటి భారత

సైనిక స్ధావరాలను కూడా ఆక్రమించుకున్నారు. దీంతో అప్రమత్తం అయినా భారత సైన్యం వాటిని సాయుధ, వైమానిక దళాలు విరుచుకు పడ్డాయి. ఈ క్రమం లోనే భారత్ కు చెందిన సైనికులు అమరులు కాగా, భారత వైమానికుడు నచికేత్ పాక్ సేనల చేతికి చిక్కాడు. భారత్ చేసిన అంతర్జాతీయ దౌత్యం ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ పాక్ కు చీవాట్లు పెట్టడంతో పాక్

సైన్యం భారత్ భూ భాగం నుంచి వెనక్కి తగ్గాయి. అయితే ఈ లోగానే భారీగా ప్రాణనష్టం జరిగిపోయింది. 
తేదీల వారీగా కార్గిల్ యుద్ధం క్రమం:. .. 

3 మే    కార్గిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు
5 మే    భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస

చేసి చంపేసారు.
9 మే    పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.
మే 10 ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు.
మే మధ్యలో భారత సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది.
మే 26    చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు

చేసింది.
మే 27    భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టెనెంట్ నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
మే 28    వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.
జూన్ 1    పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు

వేసింది.
జూన్ 5    ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది.
జూన్ 6    భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది.
జూన్ 9    బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.
జూన్ 11  

 పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జన. పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టె. జన. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది.
జూన్ 13    ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.
జూన్ 15    అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్

ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు.
జూన్ 29    భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది
జూలై 2    భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది.
జూలై 4    11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను

తిరిగి స్వాధీనం చేసుకుంది
జూలై 5    భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాఅకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
జూలై 7    బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
జూలై 11    పాకిస్తాన్ వెనక్కి

వెళ్ళడం మొదలైంది. బటాలిక్‌ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాఅధీనపరచుకుంది.
జూలై 14    ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజపాయి ప్రకటించాడు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది.
జూలై 26    కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్ళగొట్టామని

భారత సైన్యం ప్రకటించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam