DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నాటికీ రాఫెల్‌ యుద్ధవిమానాల అప్పగింత ప్రక్రియ

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*న్యూ ఢిలీ / విశాఖపట్నం, జూలై 28, 2020 (డిఎన్ఎస్):* బుధవారం నాటికి ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు భారత్‌ చేతికి అందనున్నాయి. ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్‌ కేంద్రం నుంచి ఇవి ఈ ఉదయం టేకాఫ్‌ తీసుకున్నాయి. ఈ ఐదు విమానాల్లో 3 ఒకే సీటున్నవి, మిగిలిన 2 రెండు

సీట్లున్నవి.
            ఈ విమాన ప్రయాణం రెండు దశల్లో సాగుతుంది. రాఫెల్‌పై సమగ్ర శిక్షణ పొందిన భారత వాయుసేన పైలెట్లే నడుపుతున్నారు. తొలిదశలో గాల్లో ఉండగానే ఇంధనం నింపుకుంటారు. ఇంధన ట్యాంకర్‌ను పంపి, ఫ్రెంచ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఇందుకు సహకరిస్తుంది.
            వాతావరణ పరిస్థితులను బట్టి, ఈ యుద్ధ

విమానాలు బుధవారానికి అంబాలా వాయుసేన స్థావరానికి చేరుకుంటాయి. వీటిని 17వ స్వాడ్రన్‌ అయిన 'గోల్డెన్‌ యారోస్‌' బృందంలో చేరుస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam