DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 న బెంగాల్ షట్ డౌన్ తో రైళ్ల రాకపోకలకు అంతరాయం  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 28, 2020 (డిఎన్ఎస్):* కరోనాసురుడు విజృంభిస్తున్న తరుణంలో ఈ నెల 29 న మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్తి గా షట్ డౌన్ లోకి వెళ్తున్నందున పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గుతుందని తూర్పు కోస్తా రైల్వే తెలియచేసింది. రైళ్ల వివరాలు ఇవే . . . 

28

న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే 02704 సికింద్రాబాద్ - హౌరా ఫలకనామ స్పెషల్ ఎక్సప్రెస్  భుబనేశ్వర్ దగ్గరే నిలిచి పోతుంది. హౌరా కు వెళ్ళదు. 

అదే విధంగా 29 న హౌరా నుంచి బయలుదేరవలసిన హౌరా - సికింద్రాబాద్ ఫలకనామ స్పెషల్ ఎక్సప్రెస్ భుబనేశ్వర్ నుంచి బయలుదేరుతుంది. 

28 న బయలుదేరవలసిన 02246 యస్వంత పుర్ - హౌరా

దురొంటో స్పెషల్ ఎక్స ప్రెస్ రైలు రద్దు చేయబడింది. 

అదే విధంగా 29 న బయలుదేరవలసిన 02245 హౌరా - యశ్వంతపూర్ దురొంటో స్పెషల్ ఎక్స ప్రెస్ కూడా రద్దు చేయబడింది. 

ఈ రైళ్లల్లో ప్రయాణించవలసిన  ప్రయాణీకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam