DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోము వీర్రాజు నియామకం పట్ల బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం.

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 28, 2020 (డిఎన్ఎస్):* సీనియర్ నాయకులూ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను  ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది. సోమవారం రాత్రి వెలువడిన ఈ ప్రకటన పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి

నడ్డా కు రాష్ట్ర యువమోర్చ అధ్యక్షురాలు, కాకినాడ నగరపాలక బీజేపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఆనందం వ్యక్తం చేశారు. 

భారతీయ జనతా పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న  సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోంది అనటంలో సందేహం లేదన్నారు.

పార్టీ లో అంచలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం . . .

1978లో జనతా యువమోర్చా రాజమహేంద్రవరం నగర ప్రధాన కార్యదర్శిగా నియమితులై, 
1980లో భారతీయ జనతా యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 
1982  భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యదర్శిగా, 
1984 నుంచి  జిల్లా ప్రధాన కార్యదర్శిగా ,
1987 నుంచి  యువమోర్చా

రాష్ట్ర కార్యదర్శిగా, 
1991 నుంచి  భాజపా రాష్ట్ర కార్యదర్శిగా , 
1994 వరకూ భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ,
1996 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 
2003 నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
2006 నుంచి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 
2010 నుంచి 2013 వరకు రెండోసారి ప్రధాన

కార్యదర్శిగా వ్యవహరించారు.
2013 ఇప్పటి వరకూ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
2015 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 
ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రంలో బీజేపీ పాలన తీసుకు రావడానికి అహర్నిశo కృషి చేయడంలో ప్రతి కార్యకర్త సహకారం ఉంటుందని

తెలిపారు. కాకినాడ బాలాజీ సెంటర్ మండల అధ్యక్షుడు మండపాక సూర్యనారాయణ మూర్తి, ఇంఛార్జి సాలగ్రామ వేంకట సర్వేశ్వర రావు, మహిళ మోర్చ నాయకులు మాధవి, కొందమ్మ, పావని, లక్ష్మీ, బీసీ మో ర్చ నాయ కులు ప్రకాష్, ప్రసాద్ ,రెడ్డి తదతరులు శుభాకాంక్షలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam