DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై నేరస్తులు, మిస్సింగ్ కేసుల వెతుకులాట సులభం

*జిల్లాల ఎస్పీల తో డిజిపి గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్సు* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ 13 జిల్లాల యొక్క ఎస్పి లతోనూ, కమిషనర్లతో మరియు డి. ఐ.జి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమము లో పశ్చిమ గోదావరి

జిల్లా ఎస్పి కె.నారాయణ్ నాయక్ పాల్గొన్నారు.  భారతదేశ హోమ్ శాఖా ద్వారా “ఇంటిగ్రేటెడ్ క్రిమినల్
జస్టిస్ సిస్టమ్ ”(ICJS) అను సిస్టమ్ ను అభివృద్ధి చేయబడిందని తెలిపారు. 

ఆ సాఫ్ట్ వేర్ సులభతరం గా వ్యవస్థ మద్య సమాచారము ను మార్పిడి చేస్తూ వేగవంతమైన న్యాయం చేయుట కొరకు కోర్టులు, పోలీసు / ప్రాసిక్యూషన్, జైళ్లు

మరియు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు  మధ్య డేటా మార్పిడి కి (అనుసంధానం కొరకు) అప్లికేషన్ అభివృద్ధి చేయబడింది. సదరు ఐ.సి.జే.ఎస్ ద్వారా జిల్లా కోర్టుల కోసం ఎన్.ఐ.సి, జైళ్లు  మరియు పోలీస్ స్టేషన్లు ల యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇ-జైళ్లు మరియు కనూన్ వ్యవస్థ (CIPA ఆధారంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్) EFSL అప్లికేషన్ NIC  వారి చే అభివృద్ధి

చేయబడిందని వివరించారు. 

ఈ ఐ.సి.ఎస్. జే. ద్వారా భారతదేశంలో ఇతర ప్రాంతాలకు చెందిన ముద్దాయిలను గురించి గాని, తప్పిపోయిన బాల బాలికల యొక్క సమాచారం కొరకు త్వరితగతిన వారి యొక్క సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగ పడుతుందని డిజిపి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేశారు. 
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఆంధ్ర

ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా వార్డు/ గ్రామ సచివాలయము లను ఏర్పాటు చేసినట్లు, సదరు గ్రామ /వార్డు సచివాలయంలో గ్రామ మహిళ కార్యదర్శు లు ఉన్నట్లు, గ్రామ సచివాలయం ద్వారా  ఫిర్యాదుదారులు వారి యొక్క ఫిర్యాదులను నమోదు చేస్తున్నట్లు వాటిపై  సంబంధిత అధికారులు  కాలపరిమితి లోపు గా త్వరితగతిన సదరు

సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో  ఎస్సీ & ఎస్టీ డిఎస్పి, ఏ. శ్రీనివాసరావు, మహిళా పోలీస్స్టేషన్  డిఎస్పి, జి.వి. ఎస్. పైడేశ్వరరావు, ఎస్.బి. సిఐ. కె.రజనీ కుమార్, డి. సి.అర్.బి,  సిఐ జి.వి కృష్ణారావు మరియు డిస్ట్రిక్ట్  ఐ. టి కోర్ సిబ్బంది హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam