DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా శ్రీ కనకమహాలక్ష్మీ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 31, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, ఆంధ్రుల ఆరాద్యదైవం, సౌభాగ్య ప్రదాయిని అయిన విశాఖ నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం లో అత్యంత పవిత్రమైన శుక్రవారం  వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగినట్టు ఆలయ

కార్యనిర్వహణాధికారిణి యస్. జె .మాధవి తెలిపారు. 
ఈ సందర్భంగా జరుగుచున్న శ్రావణలక్ష్మీ పూజలు నేడు 11వ రోజు మరియు శ్రావణ శుక్రవారం అగుటచే  శ్రీ అమ్మవారికి విశేషపూజ నిర్వహించారు వేదమంత్రముల మధ్య నాదస్వర సుస్వరాల మధ్య శ్రావణ లక్ష్మీ పూజలు ప్రారంబించారు.  కోవిడ్-19 నియమ నిభంధనలు కారణంగా పరోక్షంగా  87 మంది ఉభయదాతల

పేరున పూజ నిర్వహించి వార్కి కుంకుమ, ప్రసాదములు పంపుట జరిగినది.  శ్రావణమాసం నెలరోజు జరిగే ఈ శ్రావణలక్ష్మీ పూజకు (తేది:21-07-2020 నుండి 19-08-2020 వరకు) శ్రీ అమ్మవారి భక్త జనులకు విజ్ఞప్తి, కోవిడ్-19 నియమ నిభంధనలు కారణంగా ప్రతి సంవత్సరము సామూహికంగా శ్రావణమాసం నెల మొత్తం నిర్వహించు సామోహిక కుంకుమార్చనలకు బదులుగా పరోక్షంగా

నిర్వహించబడును. 
ఆసక్తి గల భక్తులు 
ఆంధ్ర బ్యాంక్, కొత్తరోడ్, 
అకౌంట్ నెం. 060810011006691
IFSC కోడ్: ANDB0000608లో చేలించవచ్చును.
    Online ద్వారా ట్రాన్స్ ఫర్ చేసినవారు మీ యొక్క transaction వివరములు, పూజ జరిపించవలసిన వారి పేరు, గోత్రనామాలు ఈ క్రింది ఫోన్ నంబర్లకు తెలియపరచవచ్చును. ఫోన్/వాట్సప్ నెంబర్లు : 9550758133, 6302260299, 9291284550 లేదా

ఇమెయిల్ id endow-eokanaka@gov.in పంపవచ్చును. 
వీటితో పాటు ఈ క్రింది ఆర్జిత సేవలకు కూడా పై నెంబర్ల నందు సంప్రదించవచ్చును 
1.    శ్రీ అమ్మవారి అష్టోత్తర కుంకుమ పూజ రూ. 50/-
2.    శ్రీ అమ్మవారి క్షీరాభిషేఖం రూ. 200/-
3.    శ్రీ అమ్మవారి పంచామృతాభిషేకం రూ. 516/-
4.    శ్రీ అమ్మవారి అష్టధళ పద్మారాదన – రూ. 1116/-(ప్రతి

మంగళవారం)
5.    శ్రీ చక్రనవవర్ణార్చన & లక్ష్మీహోమం – రూ. 2516/-(పౌర్ణమి రోజున మాత్రమే)

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam