DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వర్కింగ్ రాజధానిగా విశాఖ పట్ల సర్వత్రా హర్షం

*పార్టీలకు అతీతంగా స్వాగతం పలుకుతున్న ప్రతినిధులు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 31, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ను ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వెయ్యడం ద్వారా అధికారికంగా

ప్రకటితమైంది. అత్యంత ప్రాముఖ్యత కల్గిన శ్రావణ శుక్రవారం ( వరలక్ష్మి శుక్రవారం) నాడు ప్రకటించడం పట్ల నగర ప్రజలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రధాన పార్టీలన్నీ స్వాగతం పలుకుతున్నాయి. నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ కార్యాలయాలు, నేతల ఇల్లు పండగ వాతావరణాన్ని

తలపిస్తున్నాయి. 

సాగర తీరం సాక్షిగా. . సంప్రదాయపరుల స్వాగతం . . 

విశాఖ నగర కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి అధికారికంగా ఆమోద ముద్ర పడడం పట్ల సంప్రదాయ పరులు స్వాగతిస్తున్నారు. ఈ సందర్బంగా సాగర తీరం సాక్షిగా 
సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేసి  స్వాగతం పలికారు.  

ఆర్థిక

రాజధాని తీర్మానం చేసింది బీజేపీ నే.: రవీంద్ర రెడ్డి 

విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్నది మా ఆకాంక్ష అని, ఈ విషయాన్నీ అసెంబ్లీ లో కూడా తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందని బీజేపీ విశాఖ నగర అధ్యక్షులు ఎం. రవీంద్ర రెడ్డి తెలిపారు. ఈ  ప్రకటనను బీజేపీ స్వాగతిస్తున్నట్టు

తెలిపారు. 

గవర్నర్ కు ధన్యవాదాలు: ఎంపీ ఎంవివి 

మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషణ్  హరిచందన్‌ ఆమోదం తెలపడంపై విశాఖ ఎంపీ ఎంవీవీ  సత్యనారాయణ ఆయనకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌

లక్ష్యమన్నారు. 

ముఖ్యమంత్రి కి ఆత్మీయ అభివాదం: కేక రాజు 

విశాఖని కార్యనిర్వాహక రాజాధానిగా ప్రకటించి, పవిత్రమైన శ్రావణ మాసం లో శుక్రవారం రోజున అధికారిక ఆమోదముద్ర పడిన తరుణంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కి, విశాఖపట్నం ప్రజల తరపున ఆత్మీయ అభివాదం తెలియచేస్తున్నట్టు

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి కేకే రాజు తెలిపారు. ఈ ప్రకటన విడుదలైన సందర్బంగా స్థానిక ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam