DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దుర్ధినం: మాజీ ఎంపీ తోట సీతా రామలక్ష్మి  

*ప్రభుత్వ నిర్ణయం పై పగో జిల్లా టిడిపి అధ్యక్షురాలు అసహనం* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 31, 2020 (డిఎన్ఎస్):* మూడు రాజధానుల ప్రకటన చెయ్యడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దుర్ధినం అని మాజీ ఎంపీ, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు.

 ప్రజలు కరోనతో భయబ్రాతులకు గురి అవుతుంటే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు కు గవర్నర్ తో ఆమోదం చేయించు కోవడం సిగ్గు చేటు విభజన చట్టం ప్రకారం అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానం తో ప్రధాని చేతుల మీదుగా అమరావతి ఏర్పడింది రాష్ట్రపతి ఆమోదముద్ర తో హైకోర్ట్ అమరావతిలో ఏర్పడింది రాష్ట్ర శాసనసభ లో ఏకగ్రీవ తీర్మానం లేదు శాసనమండలిలో

తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లు ఎలా అమో దిస్తారు ఒకసారి అందరి అమోదం తో ఏకగ్రీవంగా అమరావతిని రాజదాని గ ఒప్పుకుని ఇప్పుడు మూడు రాజధానుల అనడం దారుణం మూడు రాజధానుల బిల్లు కోర్టులో ఉండగా ఇంత అర్జెంట్ గా అమోదిచవలసిన అవసరం ఏమిటి అమరావతిని రాజదాని కి ప్రధానమంత్రి తో శంకుస్థాపన చేశాక కేంద్రం కూడా రాజదాని గా

అమరావతిని గుర్తించి నిధులు విడుదల చేశాక ఇప్పుడు మూడు రాజధానుల అనడం చాలా దారుణం అసెంబ్లీలో అమరావతి కి రాజధానిగా అప్పుడు జగన్ రెడ్డి కూడా ఒప్పుకుని ఇప్పుడు మాటతప్పడం. . . మాటతప్పం మడమ తిప్పమ్ అని చెప్పే సీఎం దీనిని ఏమంటారు దేశంలో ఎక్కడ మూడు రాజధానుల లేవు ఈ ప్రభుత్వం రాజధానుల మార్పు , ఎలక్షన్ కమిషనర్ మార్పులపై

పెట్టే శ్రద్ధ కారోన పై పెట్టివుంటే ఈరోజు ఇంతమందికి వ్యాధి సోకి మరనించేవారు కాదు రాజధాని పై ప్రజలను నమ్మించి మోసం చేశారు  ఈ బిల్లు కోర్టులో నిలబడదు అమరావతి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేశారు అమరావతి జే ఏ సి పిలుపు మేరకు అమరావతి రైతుల తరుపున పోరాడతామని తెలియచేస్తున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam