DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతి 

*మాణిక్యాలరావు మృతి బాధాకరం: రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్):* భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. విజయవాడ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శనివారం

మరణించారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. 
మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది

రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. 

సీనియర్ నేత మృతి బాధాకరం : సోము వీర్రాజు 

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయనతో తనకు సుదీర్ఘ కాలం అనుబంధం ఉందని,

పార్టీ లో ఎన్నో కార్యక్రమాలు కలిసి నిర్వహించామన్నారు. 

ఆయన మృతి పార్టీ కి తీరని నష్టం. వారి మృతి పట్ల వారి కుటుంభ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాణిక్యాల రావు నేపధ్యం:. . .

ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేస్తూ 1989 లో  భాజపా లో చేరి అంచెలంచెలుగా

జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు గా పార్టీ కి పలు సేవలు అందించిన మాణిక్యాలరావు గారు 2014 శాసనసభ కుఎన్నికై తెదేపా ప్రభుత్వం లు దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి గా పని చేసి ఆయన 2018 లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్నారు.

టీడీపీ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన

మాణిక్యాలరావు  
ఫోటో గ్రాపర్‍గా కెరీర్ ప్రారంభించిన మంత్రిగా ఎదిగిన మాణిక్యాలరావు 
తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావు  
తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు కేబినెట్‍లో మాణిక్యాలరావుకు మంత్రి పదవి 
2014 నుంచి 2018 వరకు మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam