DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపై పలువురు సంతాపం

*అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు: సి ఎం వైఎస్ జగన్*

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)

అమరావతి, ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్): కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. 

బీజేపీ పార్టీకి తీరని లోటు :కిషన్‌ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ

మంత్రి

మాణిక్యాల రావు మృతి భారతీయ జనతా పార్టీ కి తీరని లోటు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం అన్నారు. 

మాణిక్యాల రావు మృతి

పట్ల తెదేపా నాయకుల సంతాపం..

పైడికొండల మాణిక్యాల రావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పని చేశామని, మంచి స్నేహశీలి. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో

అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పని చేశారు. 

మార్గదర్శకుని కోల్పోయాం: ఎంపీ  సీఎం రమేష్, 

రాష్ట్ర బీజేపీ లో అత్యంత సీనియర్, ఎందరికో మార్గదర్శకునిగా నిలిచిన మాణిక్యాల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని భాజపా ఎంపీ సీఎం రమేశ్,

 తెలిపారు.  

మాకు అత్యంత ఆప్తులు: మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి  

మాకు అత్యంత ఆప్తులు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు కరోనాతో పోరాడుతూ మృతి చెందటం బాధాకరం అని మాజీ ఎంపీ పశ్చిమ గోదావరి జిల్లా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఒకే

జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ పరంగా మిత్ర కూటమిగాను, ప్రత్యర్ధులుగానూ పనిచెయ్యడం జరిగిందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్థు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam