DNS Media | Latest News, Breaking News And Update In Telugu

3 న మహిళలపై అఘాయిత్యాల అదుపుకై ఈ-రక్షాబంధన్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియాలో జరుగు అన్యాయాలను అరికట్టటానికి మరియు ప్రజలలో చైతన్యం తీసుకురావడం కొరకు ఈ-రక్షాబంధన్ ప్రారంభం కానుంది. రక్షాబంధన్ (రాఖీ) పండగ సందర్భముగా ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ-రక్షాబంధన్ అనే కార్యక్రమమును ఈ నెల 3 న ప్రవేశపెడుతున్నట్లు శ్రీకాకుళం  జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలకు గురికాకుండా ఉండే నిమిత్తము మరియు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో అనుసరించవలసిన పద్ధతులను గురించి రాష్ట్రమంతటా సర్వే

జరుగుతుందన్నారు. 
ఈ రక్షాబంధన్ కార్యక్రమమును గురించి శ్రీకాకుళం వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్సు,  కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు మరియు  మహిళా సంఘాల వారు ఈ సర్వేలో పాలు పంచుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సందేహాలును తెలియజేయవలసినదిగా కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam