DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి : మంత్రి అయ్యన్న

విశాఖపట్నం,  à°œà±‚లై 12 , 2018 (DNS Online ):నర్సీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, గృహ నిర్మాణం, పురపాలక

సంఘం ఇంజనీరింగు పనులు అమలవుతున్న తీరును క్షుణ్ణంగా సమీక్షించారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ పనుల పట్ల

సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి సరఫరా విషయంలో చిన్నచిన్న మరమ్మత్తులను గ్రామపంచాయతీ లు నిర్వహించుకునే విధంగా అవగాహన కలిగించాలన్నారు. పెద్ద బొడ్డేపల్లి

వంతెన, ఆర్ అండ్ బి అతిథి గృహం, శారదానగర్ రోడ్డు, కృష్ణదేవిపేట రోడ్డు పనుల పురోగతిని సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖలో 123 పనులకు 96 పనులు పూర్తయ్యాయని, ఈ సంపత్

కుమార్ తెలిపారు. జోగినాథుని పాలెం నుండి పాములవాక కు రోడ్డు అభివృద్దికి రూ 10 కోట్లు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో 2150 గృహాలు

మంజూరు కాగా 1800 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని వాటిలో 400 మొదలైనట్లు డి.ఇ. చెప్పారు. పట్టణ గృహ నిర్మాణ పథకంలో 25 90 గృహాలకు 15 40 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రికి తెలియజేయగా.

రెండు వేలకు మించి దరఖాస్తులు రాకపోవచ్చని, కనుక 42 బ్లాకులను ప్రారంభించమని టిట్కోఇంజనీర్లకు మంత్రి సూచించారు. పురపాలక పరిధిలో నిధులు మంజూరు చేసి నెలలు

గడుస్తున్నా కొన్ని పనులు నత్తనడకన సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి కొత్త వీధి మీదుగా రోడ్డును అభివృద్ధి పనులు

ప్రారంభించేందుకు ఎందుకు జాప్యం జరుగుతుందని నించారు. తంగేడు వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేసి ఏడాది అయిందని, తక్షణం పనులు ప్రారంభించేందుకు చర్యలు

తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే శాఖాపరమైన సమస్యలు ఉంటే .వెంటనే పై అధికారులకు తెలియజేసి అవసరమైన మంజూరు ఆదేశాలను పొందాలన్నారు. ఇతర

సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తన దృష్టికి తేవాలన్నారు. టెండర్లు పిలిచే సమయంలో గుత్తేదారుల యొక్క సామర్థ్యాన్ని, అంకితభావాన్ని, వేగాన్ని పరిగణనలోకి

తీసుకోవాలన్నారు. కొన్ని పనులకు టెండర్లు వేయకపోవడం, సమర్ధులైన కాంట్రాక్టర్లు రాకపోవడంపై విశ్లేషణ జరపాలని సూచించారు.
ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్

అధికారి వి విశ్వేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆర్జెడి రంగనాయకులు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈజి.రామారావు, డి ఈ రామస్వామి, పంచాయతీరాజ్ ఈ ఈ సంపత్ కుమార్, డి ఈ సత్యంనాయుడు, గృహ

నిర్మాణ శాఖ డి ఈ జోగారావు, ఆర్అండ్బి డిఇ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam