DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేద బ్రాహ్మణుల ప్రాణాలంటే ప్రభుత్వానికి విలువ లేదా?

ఆర్ధిక భారంతో గోదావరిలో దూకి యువ పురోహితుని ఆత్మహత్య 

ఆర్థిక స్థితి కి ఛిద్రమవుతున్న అర్చక కుటుంబాల జీవితాలు. .

రోజు గడవడమే కష్టమైన ఈ కుటుంబాన్ని సీఎం ఆదుకోవాలి... 

ఏపీ పురోహితుల సంఘం గౌ. అధ్యక్షులు యామిజాల ఆవేదన 

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్,

అమరావతి)

అమరావతి, ఆగస్టు 10, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో పేద బ్రాహ్మణులకు బ్రతికే హక్కు లేదా, పేద బ్రాహ్మణుల ప్రాణాలంటే ప్రభుత్వానికి విలువ లేదా అని ఆంధ్ర ప్రదేశ్ పురోహితుల సంఘం గౌరవ అధ్యక్షులు యామిజాల నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన యువ

పురోహితులు ఎర్రగుంట్ల పవన్ కుమార్ శర్మ (28 ఏళ్ళు) ఆర్థిక బాధలను తట్టుకోలేక గోదావరి నదిలో దూకి ఆత్మత్యాగం చేసిన ఘటనపై అయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. పాలకొల్లు వద్ద చించిన బ్రిడ్జి దగ్గర గోదావరి లో దూకి ఆత్మత్యాగం చేయడం జరిగింది. ఈ ఘటన ఈనెల 8 వ తేదీన జరిగినా నేటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఇదే ఇతర సామజిక వర్గాల

వారైతే సామాన్యుల నుంచి బడా రాజకీయ ప్రజా ప్రతినిధులు, నాయకుల వరకూ అంతా ఏకమై రోడ్డెక్కి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తారని, ఇప్పుడు అన్యాయం జరిగింది ఒక పేద బ్రాహ్మణుడు కనుక అందరికీ లోకువగా కనపడుతున్నది మండిపడ్డారు. కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం కనికరం లేకుండా పోయిందని, ఆవేదన వ్యక్తం చేసారు. 

రోజు

గడవడమే కష్టమైన కుటుంబం: . .. 

పవన్ కుమార్ తల్లి అమాయకులని, తండ్రి ఒక వీధిలో చిన్న గుడి లో అర్చకత్వం చేస్తుంటారని, నెలసరి ఆదాయం రూ. 1000 కూడా ఉందని స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారన్నారు. దీనికి అదనంగా పవన్ బాబాయి నడుం పనిచేయక బెడ్ పేషెంట్ కాగా, నాయనమ్మ 92 ఏళ్ళ వయసు వయో వృద్ధురాలన్నారు. కరోనా కాలంలో

బ్రాహ్మణా పురోహితులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం తో పాటు, ఎటువంటి పని లేకపోవడంతో వీరు పూర్తిగా చితికిపోవడంతో మానసికంగా పవన్ క్రుంగి పోయాడన్నారు. ఇదే విషయం తన తోటి పురోహితులవద్ద చెప్పడంతో వారు సంయమనం వహించాలని, పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని చెయ్యడం జరిగిందని, అయితే ఇంట్లో కుటుంబ పరిస్థితి బాగా

దిగజారిపోవడంతో ఏమీ చెయ్యలేని స్థితిలో పవన్ ఆత్మత్యాగానికి పాల్పడ్డాడన్నారు. 

పాలకులారా కళ్ళు తెరవండి:. . .

అగ్ర వర్ణాలు అంటే అందరూ కోటీశ్వరులు కాదని, ప్రభుత్వం తెలుసుకోవాలని మండిపడ్డారు. లక్షలాదిగా  పురోహితులు, బ్రాహ్మణులూ, ఆర్ధికంగా అణగారిన వారు ఉన్నారని, వారిని కూడా మనుషులుగా గుర్తించి,

వారికి కూడా బ్రతికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు.  బాధిత పవన్ కుమార్ కుటుంబానికి ఆర్ధికంగా ప్రభుత్వం సహకారం అందించి ఆదుకోవాలని కోరారు. 

పాలకొల్లు, నర్సాపురం బ్రాహ్మణా, పురోహిత సంఘాల ప్రతినిధులు మూడు రోజుల నుంచి గోదావరి వద్ద సహాయక ఏర్పాట్లలోఉన్నారు. 
 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam