DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లాలో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? మాజీ ఎంపీ 

*టిడిపి చేసిన అభివృద్ధి కి జై కొడతారా? 3 రాజధానులు బలవుతారా?*

*పగో జిల్లా టిడిపి అధ్యక్షలు తోట సీతారామలక్ష్మి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా లో టిడిపి చేసిన అభివృద్ధి కి, గత 14 నెలల్లో వైకాపా చేసిన అభివృద్ధి పై చర్చకు

సిద్ధమా అంటూ మాజీ ఎంపీ , పగో జిల్లా టిడిపి అధ్యక్షలు తోట సీతారామలక్ష్మి సవాల్ విసిరారు. చంద్రబాబు జిల్లా లో అభివృద్ధి పై చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అభివృద్ధి అంతా టిడిపి చలవేనన్నారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశారన్నారు. మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారన్నారు. కొత్తగా 7

.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 .5 ఎకరాల ఆయకట్టు, స్థిరీకరణ కు పోలవరాన్ని 70 శాతం పూర్తి చేశారన్నారు. ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించాలి అనే సంకల్పం తో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఉచితంగా ఇసుక ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి అంతా గత 14 నెలల వైకాపా కాలంలో నేలమట్టం

చేసేశారన్నారు. ఆఖరికి రాజధానిని కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు దూరం చేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి  నుంచి అమరావతి కి ఎంత దూరం ఉంటుంది,  విశాఖకు ఎంత దూరం ఉంటుందో ఆలోచించాలన్నారు. అదనంగా 500 కిలో మీటర్ల దూరం ప్రయాణించాలన్నారు. బాబు పాలనలో 39 ,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13, 351 ఉద్యోగాలు, ఐటి ద్వారా 30,428  ఉద్యోగాలు,

అడ్వాన్సు స్టేజి లో ఉన్న 137 సంస్థల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని వైకాపా ప్రభుత్వం బల్లగుద్ది మరి చెప్తోందన్నారు. రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలు మళ్ళీ వెనక్కి వచ్చిన దాఖలాలు ఉన్నారా అని ప్రశ్నించారు. టిడిపి చేసిన అభివృద్ధి కి జై కొడతారా? లేకా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న మూడు ముక్కలాటకు బలవుతారా

అని ప్రజలని ప్రశ్నిస్తున్నారు.      

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam