DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర బ్రాహ్మణ కార్పొరేషన్ భవితవ్యం ఏంటి? చేతులెత్తేసారా?

*How Brahmin Corporation be survived without aids, crew*

*ఆంధ్ర బ్రాహ్మణ కార్పొరేషన్ భవితవ్యం ఏంటి?*

*వృద్ధాప్య పెన్షన్లు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు.*

*గతంలో ఇద్దరికీనీ, ఇప్పుడు ఇంటికి ఒక్కరికే పరిమితం.* 

*గతంలో బ్యాంకులో. .ఇప్పుడు 1 న వ్యక్తి ఇంట్లో ఉండాల్సిందే*

*సంస్థలో చైర్మన్ ఒకే ఒక్కరు, సాయం

కోరారా? లేదా చేతులెత్తేసారా?* 

*ఇకపై భారతి స్కీం ఉండదు, అమ్మఒడి, విద్యా దీవెన మాత్రమే అమలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 12, 2020 (డిఎన్ఎస్):* గతం లో వైభవంగా వెలిగిన ఆంధ్ర బ్రాహ్మణ కార్పొరేషన్ భవితవ్యం ఏంటి అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. మాజీ చీఫ్

సెక్రటరీ ఐ వై ఆర్ కృష్ణారావు సారధ్యంలో మొదలైన ఈ సంస్థ. . .దాదాపు నాలుగేళ్ల కాలం ఒక వెలుగు వెలిగింది. దీని ద్వారా భారతి పధకం ద్వారా అన్ని స్థాయిల విద్యార్థులకు ఉపకార వేతనం, విదేశీ చదువులకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం, కశ్యప పధకం ద్వారా వృద్ధాప్య పెన్షన్, గరుడ పధకం ద్వారా అంత్య క్రియల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం సత్వరం

జరిగేది. 
దీనికి సహకారంగా బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ( ప్రయివేట్ బ్యాంకు) ను కూడా నెలకొల్పి ఆర్ధికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసారు. దీని ద్వారా కార్పొరేషన్ కు ఆర్థిక లోటు లేకుండా సానుకూలత ఏర్పడింది. ఈ సంస్థలను నడిపేందుకు మండల స్థాయి నుంచి,  జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కర్తలను నియమించి,

కార్పొరేషన్ పధకాలను 
గ్రామా స్థాయి నుంచి విస్తృత ప్రచారం చేశారు.  

ఈ ఉపకార వేతనాలన్నింటినీ అర్భులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను నేరుగా జమ అయ్యేవి. ఇది గత వైభవం.

నేడు. . ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఒకే ఒక్కరు చైర్మన్ మాత్రమే ఉన్నారు. మరో సహాయక సిబ్బంది ని కూడా నియమించక పోవడం తో పాటు, ఏ ఒక్క పధకం

కూడా అందుబాటులో ఉన్నట్టు లేదు. గత ఏడాది నుంచి రావాల్సిన ఉపకారవేతనాలు, వృద్యాప్య పెన్షన్ లు నిలిచిపోయాయి. కారణం నిధుల కొరత, సిబ్బంది కొరత అనే సమాధానం వస్తోంది. 

ఇప్పుడు 1 న కచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే..

దీనిని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాలు, పెన్షన్ లను ప్రభుత్వ గ్రామా వలంటీర్ల

ద్వారా నేరుగా లబ్ది దారుల చేతికే ప్రతి నెల 1 వ తేదీన అందించేందుకు రంగం సిద్దం చేసారు. ఇది మంచి నిర్ణయం గా కనిపిస్తోంది. అయితే. .. ఈ వాలంటీర్ లబ్ధిదారుని ఇంటికి వచ్చే సమయానికి కచ్చితంగా లబ్ధిదారుడు ఇంట్లోనే అందుబాటులో ఉండాలి. ఈ పెన్షన్ ఇతరులకు ఇవ్వడం కుదరదు. లబ్ధిదారుడు అందుబాటులో లేకపోతె ఆ నిధులు వెనక్కి

వెళ్లిపోతాయి. దీంతో వృద్దులు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్బంలో కచ్చితంగా 1
 వ తేదీనాటికి తమ ఇంటికి చేరిపోవాలి, లేదంటే వాళ్లకి పెన్షన్ అందదు. 

గతంలో ఇద్దరికీనీ, ఇప్పుడు ఇంటికి ఒక్కరికే ఇస్తాం. . 

పైగా బ్రాహ్మణ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో ఇద్దరు లబ్ధిదారులు అర్హత కల్గి ఉంటె. . .గతంలో

ఇద్దరికీ పెన్షన్ ఇచ్చేవారు. నేరుగా బ్యాంకు లో జామా అయ్యేది.  ఇప్పుడు ఈనెల నుంచి ఒక ఇంట్లో ఇద్దరు అర్హులైన లబ్ధిదారులు ఉన్నా సరే ఒక్కరికే పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఇదే విషయాన్నీ గ్రామా వాలంటీర్లు ఖరాకండిగా చెప్పేస్తున్నారు. అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు?  నిధులు ఎందుకు కేటాయించినట్టు? మళ్ళీ

ప్రభుత్వ ఖాతాలోకి ఎందుకు కలిపినట్టు?

ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు? 

పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన కార్పొరేషన్ నేడు దాదాపుగా చేతులెత్తేసి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఏ పధకం చూసినా లబ్దిదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. గతం లో రావాల్సిన నిధులు కూడా

నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. తిరిగి ప్రభుత్వం లో కలిపేస్తున్నట్టుగా సంకేతాలు కూడా వస్తుండడంతో అసలు ఈ సంస్థ కు మనుగడ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 

ఒకే ఒక్కరు, సాయం కోరారా? లేదా చేతులెత్తేసారా?

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం గతం లో ఉద్యోగులు, సందర్శకులతోటి ఒక జాతర వైభవాన్ని

తలపించేది. కారణం ఒక చైర్మన్, పీఆరో, డైరక్టర్లు, జిల్లా సమన్వయ కర్తలు, కార్యాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో నిండి ఉండేది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికను ఒక అర్హులైన కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోద ముద్ర వేసేది. తద్వారా

బ్యాంకు నుంచి తక్షణం నిధులు లబ్ధిదారునికి జమ అయ్యేవి.  

నేడు ఈ కార్పొరేషన్ మొత్తానికి ఒక్క చైర్మన్ మాత్రమే నియమితులై ఉన్నారు. మరో సభ్యుడు గానీ, ఉద్యోగి గానీ అధికారికంగా లేరు. పైగా చైర్మన్ ఒక ప్రజా ప్రతినిధి కావడం తో కార్పొరేషన్ వ్యవహారాలపై ద్రుష్టి సారించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 
తద్వారా

ఈయన ఒక్కరే మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టలేక చేతులెత్తేసారా లేక, ప్రభుత్వం సాయం కోరారా అనేది తెలియాల్సి ఉంది. 

నేడు కమిటీ లేదు, పరిశీలనా లేదు, లబ్ధిదారులు మాత్రం వేలాదిగా నిధుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

చైర్మన్ కు ఖాళీ లేకుంటే. . ఎలా?

ఇంతకీ చైర్మన్ గా నియమితులైన

ప్రజాప్రతినిధికి ఈ పోస్ట్ పట్ల ఆసక్తి ఉందా లేదా అనే అనుమానాలు కూడా బ్రాహ్మణ వర్గాల్లో పెరుగుతున్నాయి. రెండు పోస్టులకు న్యాయం చెయ్యలేక పాపం ఆయన సతమతమవుతున్నారేమో అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణ వర్గాల్లోనే అనుభవం ఉంది, పూర్తి స్థాయి సమయాన్ని కార్పొరేషన్ వ్యవహారాలపై నిలపగలిగే వారికి ఈ కార్పొరేషన్

పదవుల్లో నియమిస్తే చైర్మన్ ఎదుర్కొంటున్న శిరోభారం తగ్గుతుంది అని పలువురు బ్రాహ్మణ ప్రముఖుల అభిప్రాయం.

భారతి స్కీం ఉండదు, అమ్మఒడి, విద్యా దీవెన మాత్రమే అమలు

ఈ విద్యా సంవత్సరం నుంచి భారతి స్కీం ( విద్యార్థులకు ఉపకార వేతనం) ఉండదు, లబ్ధిదారులు కేవలం జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన పథకాలకు మాత్రమే

దరఖాస్తు చేసుకోవాలని అంటూ  బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam