DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరికృష్ణ హరేరామ జపం తో మారుమ్రోగింది సిక్కోలు

శ్రీకాకుళం ఇస్కాన్ లో వైభవంగా జన్మాష్టమి వేడుకలు 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 12, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాలకు శ్రీ కృష్ణ వైభవాన్ని అందించేందుకు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులు స్థాపించిన అంతర్జాతీయ శ్రీకృష్ణచైతన్య సంఘం (ఇస్కాన్) శ్రీకాకుళం శాఖా

ఆధ్వర్యవం లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. స్థానిక పొన్నాడ బ్రిడ్జి ఇస్కాన్ మందిరంలో *శ్రీకృష్ణ జన్మాప్టమి మహోత్సవ కార్యక్రమం సాంప్రదాయంగా అంగరంగ వైభవంగా ప్రత్యేక భక్తుల  నడుమ బుధవారం జరిగింది వేకువజామున 5 గంటలకు రాధా గోవిందా భగవాన్ స్వామివార్లకు  మహా ఆరతి సేవ తులసి పూజ కార్యక్రమం జరిగింది

అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి  పంచామృతాలతో అభిషేకాలు, ఎనిమిది రకాల పండ్ల రసాలతో అభిషేకములు , అష్ట వనమూలికల రసాలతో అభిషేకములు జరుగుతాయని తదుపరి వివిధ రకాల పుష్పాలతో రాధా గోవిందలకు అలంకరణ శోభాయమానంగా జరిగిన అనంతరం స్వామివారి ఆలయం  శ్రీకృష్ణ భగవానుడు  చెప్పన్ భోగ 56 రకాల ప్రీతికరమైన  వంటకాలతో స్వామివారికి

మహా  నైవేద్యం సమర్పణ భజన కార్యక్రమం హారతి కార్యక్రమం  కన్నుల పండుగగా జరిగే వేడుకకు  భక్తులకు  పిలవకపోవడం పై ఆలయ నిర్వాహకులు  మధుర శ్యామ్ దాస్ ప్రభుజి మాట్లాడుతూ హరే కృష్ణ భక్తులకు ఈ మహత్తర కార్యక్రమానికి భక్తజనులకు పిలువక పోతున్నందుకు చింతిస్తున్నామని కరోన మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా

జిల్లాఅధికారుల ఆదేశానుసారం ఆహ్వానించక పోవడం జరిగిందని  భక్తులందరు ఇంటి వద్దనే ఉండి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోని హరేకృష్ణ శ్రీశ్రీశ్రీ రాధాగోవింద మరియు శ్రీలప్రభుపాదులవారి ఆశీస్సులను పొంది సుఖశాంతులు  అందరికీ కలగాలని  కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam