DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పటిష్టమైన వ్యాపారం ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేసుకోండి

*చేయూత పథకం ప్రారంభోత్సవం లో కమిషనర్‌ అభిషిక్త్‌*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 12, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశయానికి అనుగుణంగా చేయూత పథకంలో లబ్ధిదారులు తమ తమ వ్యాపారాలకు సద్వినియోగం చేసుకుని కుటుంబాన్ని ఆర్థికంగా

అభివృద్ధి చేసుకోవాలని రాజమహేంద్రవరం నగర పాక సంస్థ కమిషనర్‌ మరియు ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పిలుపునిచ్చారు. 45 ఏళ్లుదాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని బుధవారం నగరపాక సంస్థ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా

పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధును ఏం చేస్తారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేస్తున్న చిన్నచిన్న వ్యాపారాలకు పెట్టుబడిగా వినియోగించుకుంటామని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా లబ్దిదారులు ఏదో ఒక వ్యాపారానికి ఉపయోగించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దృష్టి సారించాలని హితవు పలికారు. రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,

మైనారిటీ మహిళల్లో అర్హులైన వారిని 11,278 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరికి ఈ ఏడాదికి రూ.21.15 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈవిధంగా ప్రతీ సంవత్సరం రూ.18,750 చొప్పున లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేయనుందని వెల్లదించారు. ఒక్కో లబ్ధిదారునికి నాలుగేళ్ల కాలంలో రూ.75 వేలు చొప్పున మంజూరు చేయనుందని

తెలిపారు. నగరంలోని ఆయా వార్డుల్లో ఎవ్వరైనా అర్హులకు ఈ పథకం మంజూరు కాకపోతే వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు. డ్వాక్రా సంఘాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాలని మెప్మా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైకాపా కో`ఆర్డినేటర్‌ ఆకు వీర్రాజు, నగర పాలక సంస్థ

అదనపు కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణ, సెక్రటరీ శైలజా వల్లి, సిటీ మిషన్‌ మేనేజర్‌(మెప్మా) శ్రీదేవి, మెప్మా సిఒలు, ఇతర లబ్దిదారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam