DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనో ధైర్యాన్ని మించిన మందు లేదు : శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దర్

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 12, 2020 (డిఎన్ఎస్):* మనో ధైర్యాన్ని మించిన మందు లేదని, ప్రతి ఒక్కరు ఆత్మస్థైర్యంతో ఉండి కరోనాను జయించాలని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో సమావేశం ద్వారా

కరోనా వ్యాధి సోకి, హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష జరిపారు.
కరోనా వైరస్ సోకిందని ఎవరు అధైర్య పడవద్దని, హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బంది యొక్క యోగ క్షేమాలను

అడిగి తెలుసుకుంటూ, అక్కడి  సౌకర్యాలను, చికిత్స ఏవిధంగా అందుతున్నది, అక్కడి పరిస్థితులు, ఆహార విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు , వంటి విషయాల గురించి ఆరా తీశారు సిబ్బందితో మాట్లాడుతూ ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నది, మరీ ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు
/> పౌష్టిక ఆహారం అనునిత్యం తీసుకుంటూ, యోగ, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటివి నిత్యం చేస్తే కరోనా నుండి త్వరగా కోలుకోవచ్చని తెలిపారు
పోలీస్ హాస్పిటల్ డాక్టర్ గారి తో మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ సిబ్బందితో ఎల్లవేళల మాట్లాడుతూ వారికి కావలసిన మందులను పంపిణీ చేసి, తగు సూచనలు ఇవ్వాలని తెలిపారు
సిబ్బంది

అందరితో ఎస్పీ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రారంభదశలో ఉన్నంత తీవ్రత నేడు లేదని,వైరస్ సోకిన ఎంతో మంది అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా తిరిగి విధులకు హాజరు అయ్యారని,కనుక భయాలను వీడి సమయానుకూలంగా విశ్రాంతి తీసుకుంటూ, తగిన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, ధైర్యంగా కరోనాతో పోరాడి, విజయం సాధించి

తిరిగి విధులకు హాజరు కావాలని, కరోనా  సోకి వైద్య, హోమైసొలేషన్ లో ఉన్న సిబ్బంది ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా, ఏ ఇబ్బంది ఎదుర్కొన్న  మీ సమీప పోలీస్ అధికారులకు లేదా నేరుగా నన్ను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు.
మనో ధైర్యమే కొండంత బలం అని, మనం ధైర్యంగా ఉంటే కరోనా ను కొన్ని రోజుల్లో జయించి మరలా మీరు విధుల్లో చేరుతామనే

 ఆత్మస్థైర్యం నింపారు అనునిత్యం మీకు పోలీస్ యూనిట్ డాక్టర్ ప్రసన్నకుమార్  గారు అందుబాటులో ఉంటారని ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా నేరుగా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకుంటూ విధులకు హాజరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam