DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదరణతో బీసీల ఆర్థికాభివృద్ధి రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖపట్నం జూలై 13: వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రారంభించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు

అచ్చెం ఆదరణనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఎంవిపి కాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో బిసిసంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన ఆదరణ-2 లో వివిధ వృత్తుల వారికి అవసరమైన ఆధునిక

పరికరాల ప్రదర్శనను మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల్లో కులవృత్తి, చేతివృత్తి

పనివారు తమ ఆర్థిక జీవన స్థితిపెంచేందుకు ఆదరణ పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ కుల వృత్తులకు ఉపయోగపడే ఆధునిక పనిముట్లు, యంత్రాలను అవగాహన

కొరకు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో వాటి యొక్క ఉపయోగాన్ని సామర్థ్యాన్ని స్వయం గా చూసి, తమ వృత్తికి తగిన పరికరం లేదా యంత్రాన్ని

ఎన్నుకోవాలన్నారు. దానిని కొనుగోలు చేయడానికి రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రదర్శనను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 70 శాతం

సబ్సిడీ ఇస్తుండగా 20% కార్పొరేషన్ చెల్లిస్తున్నట్లు కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు పెట్టుబడి ఉంటుందన్నారు. గతంలో కూడా తమ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని

ప్రవేశపెట్టి బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించింది అన్నారు. ఆధునిక పనిముట్లు కొనుగోలు చేయుటకు పది వేల నుండి 30 వేల వరకు రుణసదుపాయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 75

బీసీ ఆశ్రమ పాఠశాలలు 12 జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత వెనుకబడిన జాతులకు ప్రత్యేకంగా 30వేల రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. బీసీల

సంక్షేమానికి 11 ఫెడరేషన్ల ద్వారా రూ. 690 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చేనేత బోర్డు ద్వారా 24 లక్షల కార్మికులకు న్యాయంచేకూర్చామన్నారు.
రహదారులు భవనాల శాఖ మంత్రి

చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 125 వెనుకబడిన తరగతుల కులాలను గుర్తించినట్లు వారి అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

మేధావులతో నిపుణుల తో ఆలోచన చేసి ఆదరణ పథకాన్ని అందించారని చెప్పారు. అందుబాటులోనికి వచ్చిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆధునిక పరికరాలతో వేగవంతమైన

నాణ్యమైన పనులు చేయవచ్చన్నారు.110 రకాల యంత్రాలు పనిముట్లను ప్రదర్శనలో పెట్టారని వాటి పట్ల అవగాహన కలిగించుకోవాలన్నారు. అంతకుముందు మంత్రులు జ్యోతిరావు పూలే

చిత్రపటానికి పూల దండలు వేశారు. అనంతరం మంత్రులు ప్రదర్శనలో పెట్టిన యంత్రాలు పనిముట్లను పరిశీలించారు. ఓకే కార్యక్రమానికి విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి

రామకృష్ణ బాబు అధ్యక్షత వహించగా శాసనసభ్యులు చిన్నారాయణ మూర్తి, పి జి వి ఆర్ నాయుడు, పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ ఈ డి

గీతాదేవి, బిసి సంక్షేమ అధికారి ది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam