DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 2268 రోజులు దాటి మరో రికార్డు

*అత్యధిక రోజుల పాటు ప్రధానిగా కాంగ్రెసేతర ప్రధాని* 

*ఇంతవరకూ దేశంలో ఏ వ్యక్తికీ ఇంత భారీ ఫాలోవింగ్ రాలేదు* 
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాల్లో అత్యధిక గుర్తింపు, ఆదరణ పొందిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు ను

రాశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. గతం లో ఎన్డీఏ అధికారం లో ఉండగా నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ  ప్రధానిగా అన్ని పర్యాయాలూ కలుపుకొని 2268 రోజులు ప్రధానిగా ఉండగా.. మోదీ గురువారంతో ఈ రికార్డును అధిగమించారు. బీజేపీ సోషల్‌ మీడియా జాతీయ విభాగం ఇన్‌చార్జి

ప్రీతి గాంధీ ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు. ఇక మొత్తం ప్రధానమంత్రుల్లో సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో ఆయన నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, డా. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. నెహ్రూ 16ఏళ్లపాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్‌ పదేళ్ల పాటు ప్రధానులుగా పనిచేశారు. 

దేశ

విదేశాల్లో గతం లో ఏ భారత ప్రధానికి లభించని ఆదరణ, మద్దతు, గుర్తింపు కేవలం అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోడీ సాధించడం మరో రికార్డుగా నిలిచింది. అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్సు, తదితర ఇతర ఖండాంతర దేశాల్లోనూ మోడీకి అత్యంత ఆదరణ లభిస్తోంది. ఇక ఆసియా లో భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టి, పాకిస్తాన్, చైనా కు

హెచ్చరికలు సైతం పంపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam