DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యవసాయ మౌలిక వసతులపై కేంద్రం తో సీఎం వీడియో సమీక్ష

*గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై వైయస్‌ జగన్‌ కు వివరణ*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):* పీఎం కిసాన్‌ సీఈవో, అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌–ఏఐఎఫ్‌ మిషన్‌ డైరెక్టర్‌  వివేక్‌ అగర్వాల్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌)కి సంబంధించిన వివరాలు సీఎంకు తెలిపిన వివేక్‌ అగర్వాల్‌ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామన్న వివేక్‌ అగర్వాల్‌.

వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ

ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. 

సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం
వాటి పక్కనే రాష్ట్ర వ్యాప్తంగా

10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఉంటాయి
రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్‌బీకేలు పరిష్కరిస్తాయి
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం
కియోస్క్‌లో ఆర్డర్‌ చేయగానే 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుతాయి:
అలాగే ఇ- క్రాప్‌ చేస్తాం:
గ్రామ

సచివాలయంలో ఉన్న రెవిన్యూ అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కలిసి ఇ– క్రాపింగ్‌ చేస్తారు. వాటిలో పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.
ఇంకా జియో లొకేషన్‌ ట్యాగ్‌ కూడా చేస్తారు:
రుణాలు రాలేదని ఎవ్వరైనా చెబితే.. వెంటనే చర్యలు తీసుకుంటాం:
అలాగే బీమా సదుపాయం కూడా కల్పిస్తాం:
ఆర్బీకేల్లో

కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం:
మార్కెట్‌లో ధరలు తగ్గితే వెంటనే మార్కెటింగ్‌లో జోక్యం (ఎంఐఎస్‌) చేసుకుంటాం:

ఇంకా ఏమేం చేస్తున్నామంటే..:

రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటాం:
దీని కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తీసుకు వస్తున్నాం:
అంతే కాకుండా గ్రామాల్లో జనతా

బజార్లను తీసుకు వస్తాం:
ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది:
వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలే జరుగుతుంది:
వీటితోపాటు ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు, గ్రేడిండ్‌ కూడా అక్కడే చేస్తాం:
/> అలాగే మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
అలాగే నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తాం:
రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం:
టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్‌

ప్రాసెసింగ్‌ చేస్తాం:
ఆర్బీకేల ఆలోచన వచ్చిన దగ్గర నుంచి.. వాటి ఏర్పాటుతో పాటు.. ఈ అంశాలన్నింటిపైనా మేం దృష్టి పెట్టాం:
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం:
ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం:
పంట చేతికి వచ్చేసరికి ధరలు

తగ్గిపోయే పరిస్థితి:
దీనిపై కూడా దృష్టి పెట్టాం:

అమూల్‌తో ఒప్పందం:

అమూల్‌తో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాం:
పాడి పరిశ్రమ వృద్దికి ఇది తోడ్పడుతుంది:
అణగారిన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ఇది మంచి ఉపయోగం:
పాడి పశువుల పెంపకంతో వీరికి మేలు జరుగుతుంది:

వ్యవసాయంలో ఉత్తమ

యాజమాన్య పద్ధతులను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు తెలయజేస్తున్నాం:

సీఎం విజన్‌ బాగుంది: వివేక్‌ అగర్వాల్‌
రైతులకు సబ్సిడీలే కాదు.. సదుపాయాలు కల్పించడం అన్నది చాలా ముఖ్యమన్న వివేక్‌ అగర్వాల్‌. ముఖ్యమంత్రి దార్శినికత రైతులకు మేలు చేస్తుందన్న వివేక్‌ అగర్వాల్‌

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam