DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి సబ్ కలెక్టర్ గా అనుపమ అంజలి భాద్యతలు 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 17, 2020 (డిఎన్ఎస్):*

 రాజమహేంద్రవరం, ఆగస్టు 17: రాజమహేంద్రవరం డివిజనల్ సబ్ కలెక్టర్ గా నియమితులైన అనుపమ అంజలి సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందుగా జిల్లా కలెక్టర్ డి.మురళీధర్

రెడ్డిని కాకినాడ కలెక్టరేట్‌లో అమె మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేరుగా నిన్నటి వరకూ ఇన్‌ఛార్జ్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. అభిషిక్ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆమె సబ్ కలెక్టర్ కార్యాలయానికి

చేరుకుని సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ ఎఒ భీమారావు, తదితర సిబ్బంది సబ్ కలెక్టర్ అనుపమ అంజలికి స్వాగతం పలికారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది అమెకు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన అనుపమ అంజలి 2018లో ఐఎఎస్

ఆంధ్రప్రదేశ్ కేడర్ లో ఎంపికయ్యారు. ట్రైనీ కలెక్టర్ గా విజయవాడలో పనిచేశారు. సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ లో ఆమె చారిత్రాత్మక రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా వచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam