DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పౌరాహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించి, పురోహితులను ఆదుకోండి 

*రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు యామిజాల*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* సమాజంలోని ప్రతి పౌరుడు సుఖ, సంతోషాలతో ఉండాలి అని దీవించే పౌరాహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించాలని, రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు యామిజాల నర్సింహమూర్తి

కోరుతున్నారు. ఆర్థికంగా, సామజిక పరంగా చితికి పోయిన పురోహితులను ఆదుకోవాలని సమాజంలో వీరు కూడా జీవించే హక్కు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఒక వినతి లేఖ వ్రాసారు. ఈ లేఖ ద్వారా పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ప్రస్తుత పరిస్థితులను వివరించారు. తెల్లవారిన సూర్యోదయ సమయం నుంచి,

సాయంత్రం సూర్యాస్తమయ సమయం వరకూ పౌరులు, సమాజంలోనివారు జరుపుకునే ప్రతి పనిలోనూ మంచి, చెడు తెలియచేసి, వారితో సాంప్రదాయ పరంగా నిర్వహింపచేసేది వీరేనన్నారు. అలాంటిది నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది పురోహితులు ఇదే వృత్తిగా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మరో వారం లో జరుగనున్న వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుట బహిరంగంగా నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 

అయితే వందలాది సంవత్సరాలు నుండి వార్షికోత్సవం గా చేసుకుంటున్న ముఖ్యమైన ఈ ఉత్సవం జరుపుకోవద్దు అనేసరికి చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వైదికధర్మం ప్రకారం మండపాలు బదులుగా చిన్న యాగశాలలు వేసుకొని ఆయా

రోజులలో కేవలం గణపతిహోమం, మహా మృత్యుంజయ హోమం చేయిస్తే తద్వారా లోకశాంతి కలిగి హోమాగ్నిజ్వాల, ధూపం వలన కూడా వివిధ క్రిమి కీటకాలు నశించిపోయి కరోనా వంటి మహమ్మరులని కూడా పారద్రోలవచ్చు అనే వేదశాస్త్రాలలో పెర్నబడింది అని తెలియచేస్తున్నారు. ఈ మండపాల్లో కేవలం ఐదు నుంచి పది మంది లోపు మాత్రమే ఉండే అవకాశం

ఉంటుందన్నారు. 

ప్రతీ సంవత్సరం లాగానే ఆయా ప్రాంతాల్లో cc కెమెరాలు ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించిన ఆయా కమిటీలపై చర్యలు కూడా చేపట్టవచ్చునని తెలిపారు.

కుల వృత్తిగా గుర్తించండి : . . . . . 

ఆర్ధికంగా బలహీనపడి బతకలేక పొరహిత్యం చేయించుకొని జీవిస్తున్న బ్రాహ్మణులు కూడా అనేకమంది కడు

నిరుపేదలు వున్నారు. ఆర్ధిక అవస్థలను తట్టుకోలేని ఎందరో పేద బ్రాహ్మణులూ బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారన్నారు. 
 
 పౌరాహిత్యాన్ని కూడా కులవృత్తిగా గుర్తించి, ప్రభుత్వం అన్ని కులాలలోని కులవృత్తులు ని గుర్తించి, ప్రోత్సహించి అనేకానేక సంక్షేమ పథకాలు ని ఆయా కులవృత్తులు వారికి అందిస్తూ లక్షలాదిమంది కి

ప్రభుత్వం చేయూతనిస్తున్నా తమరి పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారని తెలియచేయుటకు సంతోషిస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam