DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్‌ సర్వే 

మ‌న ఇంట్లో స‌మ‌స్య‌గానే భావించి అండ‌గా నిల‌వాలి. . .

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* ముంపునకు గురైన ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మంగళవారం చేపట్టిన ఈ సర్వే అనంతరం సంబంధిత అధికారులకు ఆయన

దిశా నిర్దేశం చేసారు. అనంతరం రాజమహేంద్రవరం లోని విమానాశ్రయం లో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, రాజమహేంద్రవరం నగర పాలక కమిషనర్ అభిషిక్త్ కిషోర్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, తదితరులతో సమీక్ష జరిపారు.  తక్షణం సహాయ పునరావాస కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.  అందుకే వీడియో కాన్ఫరెన్స్‌

ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. 

మ‌న ఇంట్లో స‌మ‌స్య‌గానే భావించి అండ‌గా నిల‌వాలి. . .

వరద ముంపు మ‌న ఇంట్లో జరిగిన స‌మ‌స్య‌గానే భావించి

అండ‌గా నిల‌వాలని, గోదావరి జిల్లాల అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మంగళవారం గోదావరి ముంపు గ్రామాల స్థితిని విహంగ వీక్షణం ద్వారా గమనించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముంపు బాధితుల ఒక్కో ఇంటికి రూ.2 వేలు సాయం అందించాలన్నారు. స‌హాయ కార్య‌క్ర‌మాల్లో

ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేయమని సూచించారు. తదుపరి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ చేపట్టారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని

సూచించారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని, సమాచారం తీసుకోవడం కోసం ఒక అధికారిని కూడా నియ‌మించాల‌ని ఆదేశించారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట

నష్టం అంచనాలు పంపించాలి. 

ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలని, విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారుల‌ను ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam