DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పోరాట యోధులకు  పోలీస్ అధికారుల అభినందనలు 

*అదనపు ఎస్పీ సోమశేఖర్ నిర్వహణలో సిబ్బందికి ఆత్మీయ స్వాగతం.* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* కరోనా వైరస్ బారినపడి హోమ్ ఐస్లోషన్, హాస్పిటల్లో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధులకు హాజరైన శ్రీకాకుళం పోలీస్ సిబ్బందికి అపూర్వ ఆదరణ

పూర్వక స్వాగతం లభించింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ ఆదేశాలు మేరకు ఆదనపు ఎస్పీ పి. సోమశేఖర్ మంగళవారం ఈ సిబ్బందికి ఆత్మీయ స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజా సేవకు పునరంకితమైన పోలీసు వీరుల ధైర్యాన్ని మరియు మనోబలాన్ని అభినందించుట కొరకు ఇచ్చట అభినందన సభ

ఏర్పాటు చేసి మీ అందరికీ ఆహ్వానం పలకడం జరిగిందన్నారు.  అంతా త్వరగా కొలుకోని మిగతా సిబ్బందికి స్పూర్తి దాయకంగా నిలవడం చాలా మంచి పరిణామంని వైరస్ సోకిన సిబ్బంది  వెనుకంజ వేయకుండా పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం ఎంతో హర్షణీయమన్నారు. 
పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు వైద్య పరంగా ఏవైనా

అత్యవసర పరిస్థితులు తలెత్తితే వారి సహాయార్ధం పోలీసు హెల్త్ వెల్ఫేర్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఉద్యోగ నిర్వహణలో ఎవ్వరు కుడా కరోనా వైరస్ బారిన పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలుపుతూ కరోనాను జయించిన 30 మంది పోలీసు సిబ్బందికి దుస్సాలువతో సన్మానించి సర్టిఫికేట్ మరియు డ్రై ఫ్రూట్స్

అందజేయడం జరిగినది.  ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం 2 టౌన్ సి ఐ పి. వి. రమణ, ఆర్ఐలు ప్రదిప్, ఉమా మహేష్, స్వర్ణ లత లు మరియు పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.అప్పన తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam