DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్లాస్మా దానం ఎందరికో స్ఫూర్తి దాయకం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా దానం చెయ్యడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎల్ వి రామన్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే. . .
విశాఖ ఉక్కు కర్మాగారం లో  బ్లాస్ట్  ఫర్నేస్ విభాగం లో సీనియర్ మేనేజర్

గా విధులు నిర్వహిస్తున్న ఎల్ వి రామన్ మంగళవారం నగరం లో ని ఒక ప్రముఖ ఆసుపత్రి లో  కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్న వ్యక్తికి వారి కుటుంబ సభ్యులు  అడిగిన వెంటనే ఎంతో విలువైన, ప్రాణాలను కాపాడే ప్లాస్మా ను స్వచ్ఛందంగా  ఒక ప్రముఖ బ్లడ్ బ్యాంకు లో దానం చేశారు.  

కరోనా వ్యాధి నుండి  సంపూర్ణంగా కోలుకున్న

వారి ప్లాస్మా కరోనా రోగులకు చికిత్సలో ఎంతగానో సహాయపడుతుంది ఎందుకంటే వారి రక్తం లో ని  ఏంటిబాడీస్ వ్యాధిని ఎదుర్కొనడం లో విశేషంగా సహాయ పడతాయి.  

సోమవారం రాత్రి నైట్ షిఫ్ట్ నుండి  ఈ రోజు తెల్ల వారు ఝామున వరకు ఉద్యోగ బాధ్యతను  పూర్తి చేసుకుని కేవలం కొద్ది గంటల వ్యవధిలో వెంటనే ఈయన ప్లాస్మా దానం చెయ్యడం

 పట్ల అందరూ అభినందనలు తెలియచేసారు. 

జులై నెలలో ఎల్ వి రామన్ కుటుంబ సభ్యులు 5 గురు కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఈయన వైద్యం తీసుకున్న సమయం లో కూడా సాటి కరోనా రోగులకు నిరాశ, నిస్పృహ కలగ కుండా వారిని అందరినీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన వాతావరణాన్ని కల్పించి, అందరినీ

ఉత్సాహపరిచారు. 

కరోనా నుంచి బయట పడి, పూర్తి ఆరోగ్యం పొందిన వారు తమ ప్లాస్మా ను దానం చెయ్యడం ద్వారా మరికొందరికి జీవనదానం చేయవచ్చనే సందేశాన్ని ఎల్ వి రామన్ అందిస్తున్నారు. 
ఈయన సేవాభావానికి అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam