DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మారణాయుధాలు కోసం వెళితే భారీ మొత్తంలో నిధి పట్టివేత

*ట్రెజరీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారు, వెండి, నగదు పట్టివేత*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 19, 2020 (డిఎన్ఎస్):* అనంతపురం జిల్లా ట్రెజరీలో పని చేస్తున్న 
బాలప్ప ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై సోదాకోసం వెళ్లిన పోలీసులకు భారీ మొత్తంలో ఖజానా లచించింది.

వివరాల్లోకి వెళితే. . .బాలప్ప ఇంట్లో, అతని సిబ్బంది బంధువుల ఇంట్లో దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును పోలీసులు భారీగా పట్టుకున్నారు. తన డ్రైవర్ మామ  ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ ...2.42 కె.జి ల బంగారు ఆభరణాలు, 84.10 కె.జి వెండి ఆభరణాలు, రూ. 15,55,560/ ల నగదు, రూ. 49.10 లక్షల ఫిక్స్ద్

డిపాజిట్ / ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, రూ. 27.05 లక్షల ఫ్రాంసరీ నోట్లు సీజ్ చేశారు.  వీటితో పాటు రెండు మహీంద్ర కార్లు, 3 ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు, హార్లీ & డేవిడ్ సన్ మోటారు సైకిల్ , రెండు కరాశ్మా మోటారు సైకిళ్లు, ఒక హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు కూడా సీజ్ చేశారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు, తదితరాలు కల్గిఉండటంపై కేసు నమోదు

చేసారు. 

సదరు ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు సి.సి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ  జి.వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య ల  ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ శ్యాంరావు,

బుక్కరాయసముద్రం ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది తనిఖీలు చేసి ఈ భారీ నిల్వలు బయటపెట్టారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam