DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేరాలను అరికట్టేందుకు పది పటిస్టమైన సూత్రాలు

*నెలవారీ సమీక్షలో శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బార్డర్* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ లో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేర లలో రికవరి లను గురించి

 సర్కిల్ వారీగా జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ సిఐలతో సమీక్షించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈ సమీక్షా సమావేశం చేపట్టారు. 

ప్రాపర్టీ క్రైమ్,  క్రైమ్ అగైనెస్ట్ ఉమన్ నేరాలపై, ఎస్‌సి,ఎస్‌టి నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా మోసపూరితమైనా కేసుల నమోదు,

నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, చార్జిషీటు దాఖలు వరకు లోతుగా సమీక్ష చేశారు. కేసులు చేదింపునకు, నియంత్రణకు దోహదం చేసే సూచనలు, మెళకువలను గురించి అధికారుల కు  వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ అంశాలను సూచించారు. 

1)మోసపూరితమైనా నేరాలు పై ప్రేత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేసి

ముద్దాయిలని అరెస్ట్ చేయాలని
2)ఎస్‌సి,ఎస్‌టి నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి శాంతి భద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని,ట్రబుల్ మాంగర్ లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని.
3. జిల్లా లో గంజాయి,మద్యం అక్రమ రవాణా ను అరికట్టాలిని, 
4)ప్రభుత్వము వారు నిషేధించిన గుట్కా, ఖైని అమ్మకాలు జరగకుండా చూడాలి అని, 
5).అలాగే ఇసుక

అక్రమ రవాణా ను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని, 
6).ఆస్తి సంబందిత నేరాలకు అడ్డుకట్ట వేయాలి అని తెలిపినారు.
7).ప్రతి విలేజ్ ని పోలీసు అధికారులు విజిట్ చేయాలని సదరు గ్రామంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలైన, పేకాట, నాటుసారా స్థావరాలపై దాడులు  నిర్వహించలని 
8).పెండింగ్ లో ఉన్న NBW లను అమలు పర్చి ముద్దాయి లను

 కోర్ట్ లలో హాజరుపరచాలని. 
9).అన్ని పోలీసు స్టేషన్ల పరిదీలలో రాత్రి వేళలో నిర్వహించే గస్తీని పటిష్టం చేయాలన్నారు.
10). రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.    పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్  గారు ఈ

సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు
ఈ సమావేశంలో, డి.సి.ఆర్.బి, సిఐ ఆర్. గోవిందరావు, ఎస్.బి సిఐ శంకరరావు, పాలకొండ సబ్ డివిజన్ సిఐలు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam