DNS Media | Latest News, Breaking News And Update In Telugu

400 కేజీల గంజాయి అక్రమ రవాణా, 6 గురు అరెస్ట్. . .

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 23, 2020 (డిఎన్ఎస్):*

గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 6 గురు నిందితుల అరెస్ట్ వారి వద్ద నుండి
సుమారు రూ. 32 లక్షలు విలువైన 400 కేజీల  గంజాయి ఏలూరు రూరల్ పోలీసులు. స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె.నారాయణ్ నాయక్ కి వచ్చిన

సమాచారం మేరకు ఏలూరు డి.యస్.పి దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో, ఏలూరు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాస రావు అద్వర్యంలో ఆశ్రం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచున్న ఏలూరు రూరల్ ఎస్ఐ విశాఖపట్నం నుండి వస్తున్న రెండు కార్లను ఆశ్రం జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని సోదా చేసారు.  అందులో 16 మూటలు గా కట్టిన సుమారు 400 కేజీల

గంజాయిని,గుర్తించడమైనది. కారులో ప్రయాణిస్తున్న రాజస్తాన్ కి చెందిన హర్ఫుల్ జాట్ అనే వ్యక్తీ ని అదుపులోకి తీసుకొని విచారించగా, తను ఈ గంజాయిని నర్సీపట్నంలో కొనుగోలు చేసి, పోలీసులకు అనుమానం రాకుండా, ఆయా కార్లల్లో మహిళలను కూడా ఎక్కించి తీసుకోస్తునట్లు చెప్పాడు. తను ఈ గంజాయిని విసన్నపేట మరియు ఇతర ప్రాంతాలకు రవాణా

చేస్తానని చెప్పాడు. రెండు కార్లను తనిఖీ చేసి, 25 కేజీలు చొప్పున ప్యాక్ చేసిన 16 బస్తాలను, రెండు సెల్ ఫోన్ లను, రెండు కార్లను సీజ్ చేయడమైనది.

అక్రమ రవాణాలో నిందితులు: 

హర్ఫుల్ జాట్ S/o పోకార్ జాట్ A/33Yrs C/జాట్ R/o విస్సన్నపేట , కృష్ణా జిల్లా. 
సొంతూరు రాజస్తాన్ లోని బిల్వారా (తీసుకునే వ్యక్తి ) 
ఆర్లి

శ్రీను  S/o అప్పారావు A/27 yrs C/మాల R/o రత్నం పేట, రోలుగుంట మండలం, విశాఖపట్నం జిల్లా (రవాణాదారుడు)
ఉర్ల సత్యవతి D/o కన్నబాబు 20Yrs, మాల R/o జోగుం పేట (V) గొలిగొండ (M) విశాకపట్నం జిల్లా. 
 గాలి కృష్ణ S/o రాజులు A/32 yrs C/ కొప్పుల వెలమ R/o బుచ్చెంపేట (V) రోలుగుంట (M) విశాఖపట్నం Dist.(ట్రాన్స్పోర్టర్)
ఈపూరి అశోక్ S/o చంటి, 30Yrs, మాదిగ, R/o శనివారపుపేట,

ఏలూరు.(associate)
సుకదేవి ఘీషింగ్ W /o కృష్ణ బహదూర్ మక్తాన్ 48Yrs, R/o సింహాచలం, విశాకపట్నం.  పూర్వీకులది నేపాల్.
మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. 

కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది:
ఏలూరు రూరల్ CI శ్రీ  A. శ్రీనివాస రావు, SI చావా సురేష్, HC రమణ, PCs N గోపాల కృష్ణ, D సురేంద్రబాబు, D ప్రదీప్, భగవాన్, WPCs T

మాధవీ రాణి, Ch లక్ష్మి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam