DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయంలో ప్రబంధ నిత్య పారాయణ దారుల తొలగింపు

*సింహాగిరి పై నిత్య పారాయణదారులను నిలపమని ఈవో ఆదేశం జారీ?* 

*దివ్యప్రబంధం, రామాయణం సహా అన్ని పారాయణాలూ.* 

*ఇచ్చేది రోజుకు రూ. 300, అది కూడా దేవస్థానానికి భారమైందా?*

*వందల ఏళ్లుగా జరుగుతున్న ప్రబంధ పఠనం నిలిచింది. .* 

*కరోనా లో కూడా ఆగలేదు, ఇప్పుడు ఎవరి

ఆదేశాలిచ్చారు?*

రెగ్యులర్ అర్చకులపై అదనపు పని భారం:

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 24, 2020 (డిఎన్ఎస్):* దేశంలోనే అత్యంత పురాతన, ప్రఖ్యాత చరిత్ర కల్గిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో కొన్ని వందల ఏళ్లుగా జరుగుతున్న శ్రీరామాయణ, భాగవత,

దివ్యప్రబంధ సహిత అన్ని పారాయణాలూ అర్ధాంతరంగా నిలిచిపోయాయని వైదిక సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. సోమవారం నుంచి గౌరవ సంభవం వైదిక స్వాములను తక్షణం నిలిపివేయాల్సిందిగా దేవాలయ సిబ్బంది ఆదేశాలు జారీచేయడంతో ఒక్కసారిగా విస్తుపోయారు వైదిక సిబ్బంది. దీనితో సుప్రభాతమ్ సహా, ఇతర నిత్య పారాయణాలూ రెగ్యులర్ వైదిక సిబ్బంది

అదనంగా చేయాలని ఈఓ ఆదేశంగా వారు తెలియచేసారు. 

కొన్ని శతాబ్దాలుగా ఏ ఒక్క రోజూ ఈ ప్రబంధ, వేద పారాయణాలు, శ్రీరామాయణం, శ్రీమద్భాగవతం, పురాణం సింహాచల క్షేత్ర మహాత్మ్యం తదితర అన్ని పారాయణాలూ తాత్కాలిక శ్రీవైష్ణవ స్వాములే కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పారాయణ చేసేవారు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు.

వీరికి రోజులు రూ. 300 మాత్రమే గౌరవ సంభవం ఇవ్వడం జరుగుతోంది. దేవస్థానానికి వీరికి ఇచ్చే రూ. 300 చాలా ఆర్ధిక భారమైపోయిందిట, అందుకే వీరి సేవలు దేవస్థానానికి అవసరం లేదంటూ ఆలయ సిబ్బంది అనధికారికంగా తెలియచేయడం గమనార్హం. 

రాష్ట్రంలో తిరుమల తర్వాత 6 ఏ ఆలయంలో అతి పెద్ద, ప్రాధాన్యత ఉన్న దేవాలయం సింహాచలం. అలంటి ఆలయంలో

నిత్యం జరిగే ప్రబంధ, పురాణం పారాయణాలు ఇంకెక్కడా జరగవు. 

వీటిని నిలుపుదల చేయడాం పై ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్  సుమారు రెండు గంటల సమయం ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే ప్రయత్నం చేసినప్పడికీ ఈఓ భ్రమరాంబ పట్టించుకోకపోవడం గమనార్హం. 

గత నాలుగు నెలల కరోనా కాలం లో సైతం వీరు నిత్యం పారాయణము

కొనసాగించడం గమనార్హం. 

ఇంతకీ ఈ దేవాలయంలో నిత్యం జరిగే సుప్రభాత, దివ్య ప్రబంధ, పురాణం, తదితర పఠనం అర్దాంతరంగా నిలుపుదల చెయ్యడానికి ఎవరు ఆదేశం ఇచ్చారు అన్న విషయం తెలియాల్సి ఉంది.  

రెగ్యులర్ అర్చకులపై అదనపు పని భారం:

గౌరవ పారితోషికం సిబ్బంది ని నిలుపుదల చెయ్యడం తో వారు చేస్తున్న

సుప్రభాతం, ఇతర నిత్య పారాయణాలు ఇకపై రెగ్యులర్ వైదిక సిబ్బంది చెయ్యాల్సి యుంటుంది. 
దీనికోసం ప్రతి ఒక్కరూ ఒక గంట లేదా గంటన్నర సమయం అదనంగా విధులు నిర్వహించవలసి ఉంటుంది. 

అయితే రెగ్యులర్ సిబ్బంది లో ఎంతమంది నిత్య పారాయణ చెయ్యగలరు, అలవాటు ఉందొ తెలియాల్సి ఉంది. వీరిలో ఆరాధనలు చేసే వైదికులకు పారాయణ

చెయ్యడం అలవాటు ఉండదు. పైగా కొంత అదనపు సమయం పెట్టె అవకాశం ఉంటుంది. దీంతో వీరి రెగ్యులర్ విధులకు ఆటకం కలిగే అవకాశం కూడా ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam