DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రగతి పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ స్పందన 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 25, 2020 (డిఎన్ఎస్):* వివిధ జిల్లా ల కలెక్టర్లు, పోలీసు అధికారులతో 
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. దీనిలో వరదలు, కోవిడ్, ఇళ్ల స్థలాల పట్టాలు,

ఉపాధి హామీ పనులు – గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, స్కూళ్లలో నాడు– నేడు, వైయస్సార్‌ చేయూత, ఇ–క్రాప్‌ బుకింగ్, ఆర్బీకేల్లో గోదాములు తదితర అంశాలపై చర్చించారు. 

వివిధ అంశాలపై కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏమన్నారంటే..:

వరదలు – సహాయ

కార్యక్రమాలు:

– దేవుడి దయతో గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టాయి :
గోదావరిలో 10 లక్షల క్కూసెక్కుల కంటే తక్కువకు వరదనీరు తగ్గుతుందన్న సమాచారం వస్తోంది: సీఎం
– కృష్ణా నదిలో కూడా వరదలు తగ్గుముఖం పడుతున్నాయి:
– శ్రీశైలంలో గేట్లు కూడా మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి:
– సెప్టెంబరు 7 లోగా పంట

నష్టంపై అంచనాలు రూపొందించి, ఆ మేరకు బిల్లులను కలెక్టర్లు సమర్పించాలి:
– దీనిపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి:
– కృష్ణా జిల్లా సహా మిగిలిన చోట్ల ఎక్కడ పంటలు దెబ్బ తింటే.. అక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి:

– సెప్టెంబరు 7లోగా గోదావరి ముంపు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున

అదనపు సహాయం ఇచ్చేలా ప్రణాళిక వేసుకోండి:
– ఆ రూ.2 వేలు మాత్రమే కాకుండా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళ దుంపలు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా ఇవ్వాలి:
– సెప్టెంబరు 7 కల్లా అవి పంపిణీ జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి:
– వరదల కారణంగా

ఇరిగేషన్‌ వసతులు దెబ్బ తిన్న చోట్ల వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి:
– రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున అందుబాటులో మందులు ఉంచుకోవాలి:
– వరద నీరు తగ్గుముఖం పట్టింది కాబట్టి.. రోగాలు రాకుండా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది, వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించండి:
– మండల స్థాయిలో నిత్యావసర సరుకులను

పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోండి:
– పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం, తాగు నీటి క్లోరినేషన్‌ కోసం చర్యలు తీసుకోండి:
– పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి:
– గోదావరి వరదల సమయాల్లో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు బాగా పనిచేశారు. వారికి అభినందనలు :

కోవిడ్‌ నివారణా చర్యలు:



కోవిడ్‌ నివారణా చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలను చేపట్టింది: సీఎం
– దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేసి రికార్డు నెలకొల్పాం:
– కోవిడ్‌ క్లస్టర్లలో ఉద్ధృతంగా పరీక్షలు చేసి.. కోవిడ్‌ సోకిన వారిని గుర్తిస్తే హైరిస్కు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలు కాపాడుకోగలుగుతాం:
– కోవిడ్‌ సోకిన

విషయాన్ని వీలైనంత త్వరగా గుర్తించగలిగితే.. చిన్న చిన్న మందులతోనే ఇంట్లోనే కోలుకునే అవకాశం ఉంటుంది:
– వీలైనంత త్వరగా కోవిడ్‌ సోకిన వారిని గుర్తించే దిశ గానే పరీక్షలు ఉద్ధృతంగా చేస్తున్నాం, ఇది కొనసాగాలి:
– 24 గంటల్లోగా కోవిడ్‌ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడండి, దీని కోసం అన్ని రకాల చర్యలు

తీసుకోండి:

– కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి:
– బాధితులు వేచి చూసే పరిస్థితులు లేకుండా అరగంటలో కచ్చితంగా బెడ్‌ ఇవ్వాలి:
– బెడ్‌ దొరకలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు, అరగంటలోగా బెడ్‌ కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే:
– 104, 14410 సహా వివిధ కాల్‌

సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి:
– దీనిపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి, గట్టిగా ధ్యాస పెట్టాలి:
– కాల్‌ సెంటర్లకు వచ్చే కాల్స్‌కు కచ్చితంగా స్పందించి పరిష్కరించాలి:
– ఆస్పత్రుల్లో ఉన్న హెల్ప్‌ డెస్క్‌లు కళ్లు, చెవులుగా కలెక్టర్లు భావించండి:
– కోవిడ్‌

ఆస్పత్రుల్లో ఉన్న హెల్ప్‌ డెస్క్‌లు బాగా పని చేసేలా చూడండి:
– కోవిడ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది, ఆహారం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్‌ లైన్లు, మందులు తదితర అంశాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? అన్నది చూడండి:
– వీటిని పరిగణలోకి తీసుకుని ఆయా ఆస్పత్రులకు రేటింగ్‌  ఇవ్వండి:
– ఈ 6 అంశాల్లో కచ్చితంగా

ప్రమాణాలు పాటించేలా చూడండి: 
– కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలు నాణ్యంగా ఉండాలి:
– సీసీ కెమెరాల ద్వారా కోవిడ్‌ ఆస్పత్రులను పర్యవేక్షించాలి:
– అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు పెట్టాలి:
– వార్డుల్లో కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా మానిటర్‌ చేయాలి:
– అలాగే కోవిడ్‌ వచ్చిందని భావిస్తే..

ఏం చేయాలి? ఎవరికి కాల్‌ చేయాలి? అన్నదానిపై అవగాహన కలిగించాలి:
–  ఈ రెండు అంశాల మీద అవగాహన లేని మనిషి రాష్ట్రంలో ఉండకూడదు:
గ్రామ, వార్డు సచివాలయాలు సహా ప్రతిచోటా దీనికి సంబంధించిన హోర్డింగ్స్‌ పెట్టండి, విస్తృతంగా ప్రచారం నిర్వహించండి:
– కోవిడ్‌ కోసం తాత్కాలికంగా డాక్టర్లు, నర్సుల నియామకాలపై దృష్టి

పెట్టాలి:
– కోవిడ్‌ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలి:


‘కోవిడ్‌పేరుతో అధిక ఛార్జీలు వేస్తే చర్యలు’:


– కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స కోసం ఎక్కువగా ఛార్జ్‌ చేస్తున్నారు:
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీవో)లో పేర్కొన్న దాని కంటే.. ఎక్కువ వసూలు చేస్తే

కచ్చితంగా చర్యలు ఉంటాయి:
– దీనిపై కలెక్టర్లు, పోలీసులు దృష్టి పెట్టాలి:
– కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చిన సమయంలో ఎవరైనా కూడా మానవత్వం చూపించాలని ప్రజలు ఆశిస్తారు:
– కానీ మానవత్వం చూపించకుండా అధికంగా డబ్బు వసూలు చేసే సంస్కృతి ఉన్న ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి:
– అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోండి:
/> – మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి.. అందులో  3 నుంచి 5 మంది సభ్యులను నియమించి, కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రతా నియమాలు పాటిస్తున్నారా? లేదా? అని చూడండి:
– కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదా? అని చూడండి:
– కనీసం అగ్ని ప్రమాదాలను నిరోధించే సిలెండర్లు ఉన్నాయా? లేదా?

చూడండి:
– లేకపోతే కొంత సమయం ఇచ్చి.. అవి ఏర్పాటు చేసిన తర్వాతే ఆస్పత్రులను తెరవమని చెప్పండి:త
– భద్రతా పరంగా కావాల్సిన పరికరాలు పెట్టిన తర్వాతే ఆస్పత్రులు పని చేయాలని చెప్పండి:
– చిన్న చిన్న ఘటనల్లో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తున్నాం:
– అలాంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలి:
– జరిగిన

ఘటన నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి:

ఆరోగ్య శ్రీ:

– మన దగ్గర పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఇలా వివిధ స్థాయిల్లో ఆస్పత్రులు ఉన్నాయి:
– ప్రతి చోటా హెల్ప్‌ డెస్క్‌లను పెట్టి, అందులో ఆరోగ్య మిత్రలను కూర్చోబెట్టండి:
– ఒక ఆరోగ్య శ్రీ పేషెంట్‌ వస్తే.. మానవత్వంతో డీల్‌ చేయాలి:


వచ్చిన పేషెంట్‌కు వైద్యం చేసే పరిస్థితి అక్కడ లేకపోతే.. వారు ఎక్కడకు వెళ్లాలి అన్న విషయంలో హెల్ప్‌ డెస్క్‌ పని చేయాలి:
– ఇక్కడ సదుపాయాల్లేవు.. వెళ్లిపోండి అన్నట్టుగా ఉండకూడదు:
– ఫలానా చోటకు వెళ్లండి. నేను అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాను.. అన్న రీతిలో ఉంటే.. పేషెంట్‌కు ఊరట లభిస్తుంది:
– ఆరోగ్యశ్రీ

రిఫరెల్‌ వ్యవస్థ ఆ స్థాయిలో బలోపేతంగా ఉండాలి:
– ఎక్కడ వైద్యం లభిస్తుందో ఫోన్‌ చేసి, పేషెంట్‌కు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలి:
– అంతే కాక ఆరోగ్య ఆసరా పథకం కూడా బలంగా అమలు కావాలి:
– పేషెంట్లు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225, లేదా నెలకు రూ.5 వేలు ఇవ్వాలన్నది మన స్కీం:
– పేషెంట్‌ ఆస్పత్రి నుంచి

బయటకు వస్తున్న సమయంలో ఆరోగ్య ఆసరా అందాలి, ఆ డబ్బు అక్కౌంట్లో పడాలి:
– ఈ రెండు మార్పులు మనం తీసుకు వచ్చినప్పుడు మాత్రమే.. మనం రెండు అడుగులు ముందుకు వేసినట్టు:
– జాయింట్‌ కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి:

ఇళ్లపట్టాలు :

– ఒక మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు :
– దీనిపై

వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది:
– చంద్రబాబునాయుడు గారు, ఆయన పార్టీకి చెందిన వారు నానా రకాలుగా కేసులు వేసి అడ్డుకుంటున్నారు:
– రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు 30 లక్షల అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నాం:
– దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు:
– అదే పనిగా

దగ్గరుండి చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు వేయిస్తున్నారు: 
– కలెక్టర్లు సమీక్షలు చేసి కౌంటర్లు ఫైల్‌ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలి:
– కొంత సమయం పట్టినా కూడా చివరకు న్యాయమే గెలుస్తుంది, మంచే గెలుస్తుంది:
– ఆగస్టు 15న కార్యక్రమం అనుకున్నాం.. కానీ వాయిదా పడింది:
– అతి త్వరలోనే

ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం, ఆ మంచిరోజు రానే వస్తుంది:
– మంచి రోజు వచ్చే లోపల మనలో స్థైర్యం కోల్పోకూడదు :
– ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలూ పూర్తి కావాలి:
– ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలు పూర్తి కావాలి:
– సర్గిగా చేయని లేఅవుట్లపై దృష్టి

పెట్టాలి, ఆ లేఅవుట్లలో మొక్కలు నాటాలి: 
– ఇళ్ల స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం పూర్తి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలి:
– ఎమ్మార్వోలతో కలెక్టర్లు సమీక్ష చేయాలి:
– లబ్ధిదారుల ఫొటోలు తీసుకోవడం, వారి ప్లాటు హద్దులను తీసుకోవడం.. తదితర పనులను పూర్తి చేయాలి:

ఉపాధిహామీ పనులు:
– రైతు భరోసా

కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, వైయస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగంగా జరగాలి
– గ్రామ సచివాలయాల భవనాలు 2021, మార్చి కల్లా పూర్తి కావాలి:
– అంగన్‌ వాడీలపై కూడా దృష్టి పెట్టాం:
– దీనికి సంబంధించి కార్యాచరణ తయారవుతోంది:
– వైయస్సార్‌ ప్రీప్రైమరీ

స్కూల్స్‌గా వాటిని మారుస్తున్నాం:
– దాదాపు 10 రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం:
– 55 వేల అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద పనులు చేపడతాం:
– వచ్చే వారానికల్లా ప్రణాళిక సిద్ధం అవుతుంది:

స్కూళ్లలో నాడు – నేడు:
– స్కూళ్లలో నాడు–నేడుపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం


జేసీలు వచ్చాక.. పనుల్లో బాగా పురోగతి కనిపించింది:
– ప్రస్తుతానికైతే సెప్టెంబరు 5న స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నాం:
– ఈలోగా పనులు పూర్తి చేయాలి, అన్నిరకాల సదుపాయాలను సెప్టెంబరు 5వ తేదీలోగా ఏర్పాటు చేయాలి:
– పనుల్లో నాణ్యతకు దృష్టి పెట్టాలి, స్కూళ్లకు ఫర్నిచర్‌ చేరడం మొదలవుతోంది:

వైయస్సార్‌

చేయూత:

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు వైయస్సార్‌ చేయూతను అందించాం:
– అక్కడక్కడా బ్యాంకు మేనేజర్లు డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని సమాచారం వస్తోంది:
– అవన్నీ కూడా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంక్‌ అక్కౌంట్లు, ఆ డబ్బు మహిళలకు సంబంధించినది:
– కలెక్టర్లు వెంటనే సంబంధిత

బ్యాంకు మేనేజర్లతో మాట్లాడాలి:
– బ్యాంకులకు ఆ డబ్బుపై ఎలాంటి హక్కు లేదు, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. వెంటనే కలెక్టర్లు పరిష్కరించాలి:
– మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబిల్, రిలయన్స్, అమూల్, అల్లానా గ్రూపులతో అవగాహనా ఒప్పందాలు

కుదుర్చుకున్నాం:
– 19 లక్షల మంది మహిళలు వివిధ జీవనోపాధి మార్గాల కింద ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు :
– ఈ కార్యక్రమం అమలుపై రాష్ట్రస్థాయిలో ప్రతి 15 రోజలకోసారి 8 మంది మంత్రులతో కూడిన బృందం రివ్యూ చేస్తుంది:
– ప్రతి వారం కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్, సెర్ప్‌ ప్రతినిధులు, బ్యాంకర్లు సమీక్ష చేయాలి:
– మహిళలకు

ఏం కావాలో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి:
– వారు ఎంపిక చేసిన జీవనోపాధి మార్గాలన్నీ కూడా వారు చేసుకునేలా చేయూత నివ్వాలి:
– సెప్టెంబరు నెలలో ఆసరాకు సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో అనుసంధానం అవుతారు:
– ఆసరా ప్రారంభం కాకముందే .. చేయూత మహిళలకు తమ జీవనోపాధి కార్యక్రమాలను గ్రౌండ్‌ చేసుకునేలా

చూడాలి: 
– అమలు కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించుకున్న సమయాన్ని అందరికీ పంపించాం కూడా:
–  వచ్చే స్పందనలో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు, స్థితిగతులపై సమీక్ష చేస్తాం:

ఇ – క్రాప్‌ బుకింగ్‌:

– జాయింట్‌ అజమాయిషీ పూర్తి చేయడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి:
– ఇ– క్రాపింగ్‌

పూర్తి కాకపోతే తర్వాత కార్యక్రమాలు దెబ్బ తింటాయి:
– నూటికి నూరు శాతం ఇ– క్రాపింగ్‌ బుకింగ్‌ పూర్తి కావాలి:
– సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి:
– గ్రామ సచివాలయంలోని రెవిన్యూ అసిస్టెంట్, సర్వేయర్‌లకు మార్గ నిర్దేశం చేసి ఇ– క్రాపింగ్‌ పూర్తయ్యేలా చూడాలి:
– ఇది చాలా ముఖ్యమైన

కార్యక్రమం:

– వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి:
– రైతుల గ్రూపులను ఏర్పాటు చేయడం, యంత్రాలను డెలివరీ చేయడం పూర్తి చేయాలి:
– మండల స్థాయిలో కూడా ఇదే తరహాలో రైతులతో గ్రూపులను ఏర్పాటు చేయాలి:
– హై వాల్యూ  యంత్ర పరికరాలతో హబ్స్‌ కూడా ఏర్పాటయ్యేలా

చర్యలు తీసుకోవాలి:
– వర్షాలు బాగా పడినందున ఎరువుల డిమాండ్‌ పెరుగుతుంది:
– మండలాన్ని, ఆర్బీకేను ఒక్కో యూనిట్‌గా తీసుకుని ఎరువుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చూసుకోండి:
– అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలి:

– ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఒక ఎకరా భూమిని గుర్తించండి:
– ఇక్కడ బహుళ సదుపాయాలను

ఏర్పాటు చేస్తున్నాం:
– గోడౌన్లు, పంటను ఆరబెట్టుకోవడానికి ఫ్లాట్‌ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్స్, పశువుల శాల, కలెక్షన్‌ సెంటర్‌ తదితర కార్యకలాపాల కోసం వసతులన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం:

– సెప్టెంబరు 1న సంపూర్ణ పోషణ్, సంపూర్ణ పోషన్‌ ప్లస్, సెప్టెంబరు 5న జగనన్న విద్యాకానుక,

సెస్టెంబరు 11న వైయస్సార్‌ ఆసరా ప్రారంభిస్తున్నాం:

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam