DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో  వైభవంగా రాధాష్టమి వేడుకలు. . .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని హరేకృష్ణ మూవ్మెంట్, ఇస్కాన్ సంస్థల నిర్వహణలో శ్రీ రాధాష్టమి 2020  ఉత్సవములు శ్రీ శ్రీ నితాయి గౌరంగా మందిరం లో అంగ రంగ వైభముగా నిర్వహించడం జరిగాయి. కోవిద్ కారణముగా  భక్తుల సౌకర్యాడం  లైవ్ ద్వారా  చూచే

 అవకాశము కలిపించబడినది. శ్రీ కృష్ణ జన్మాష్టమి  తరువాత వచ్చు  అష్టమి రోజును  శ్రీ రాధా దేవి  పుట్టిన రోజు జరుపుకొనడం ఆనవాయితీ. 

హరే కృష్ణ మూవ్మెంట్ లో : . . .

బుధవారం శ్రీ రాధాష్టమిని శ్రీ కృష్ణ భక్తులు హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యములో వైభవంగా నిర్వహించారు. శ్రీ నితాయి గౌరంగా మందిరం

 సీతమ్మధార ( ఎన్ ఆర్  ఐ హాస్పిటల్ వెనుక) నందు వైభోగముగా నిర్వహించడం జరిగింది .ఉత్సవంలో భాగముగా  మందిరము పూలతో అలంకరణ చేయడం జరిగింది . 

ఇస్కాన్ విశాఖపట్నంలో : . . .

అంతర్జాతీయ కృష్ణ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ విశాఖపట్నం లోని సాగర్ నగర్ లోని బీచ్ రోడ్ లో గల శ్రీ శ్రీ రాధా దామోదర్ మందిరంలో వైభవగా

రాధాష్టమి వేడుకలు నిర్వహించారు.  శ్రీ కృష్ణ‌ భగవానుని శక్త్యావేశ అవతారమైన రాధారాణి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన రోజు రాధాష్టమి. రాధారాణి మొత్తం విశ్వానికే తల్లి. అన్ని జీవులను  శ్రీ కృష్ణ‌ భగవానుని ప్రేమపూర్వక భక్తియుక్త సేవలో నియుక్తులను చేసి వారిని తరింపజేసే ఆమె యొక్క వైభవాన్ని శాస్త్రాలు

కీర్తిస్తున్నాయి.
వేడుకల్లో ఉదయం 9.00 గంటలకు భజన కీర్తనలతో ప్రారంభమైంది. విశాఖ శాఖా  అధ్యక్షులు సాంబ దాస్ భక్తులనుద్దేశించి రాధాకృష్ణుల వైభవాన్ని ప్రవచనం లో అందించారు. తదుపరి రాధాకృష్ణులకు పంచామృత అభిషేకం మరియు పుష్పాభిషేకం, రాజభోగ ఆరతి,  ప్రసాదం అందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, విదుషీమణి నితాయి సేవిని

మాత చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం లో రాధాష్టమి ప్రద్హన్యతని తెలిపారు. 

ప్రస్తుతం కరోనా రాక్షసుడు విస్తరిస్తున్నందున కేవలం స్థానిక భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఈ వేడుకలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam