DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి లో గిన్నిస్ రికార్డు కీసర ఎంఆర్ఓ నాగరాజు దే 

*20 మి. డాలర్ల లంచం ప్రపంచంలో ఇదే ప్రథమం:*  

*లంచగొండుల కోసం ఒక విభాగం ప్రారంభిస్తాం: గిన్నిస్ బుక్*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* రూ.1.10 కోట్లు లంచం తీసుకున్న నాగరాజు లంచగొండుల విభాగంలో గిన్నిస్ రికార్డు కెక్కందుకు సిద్ధంగా ఉన్నాడు. దీనిపై

గిన్నిస్ రికార్డు అధికారులను స్వచ్చంద సంస్థలు సంప్రదించడంతో హతాశులై, త్వరలోనే లంచగొండుల కోసం విభాగం ప్రారంభించనున్నట్టు తెలిపారు. తెలంగాణలో సంచలనం రేపిన కీసర తహసీల్దారు బాలరాజు నాగరాజు, అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా ఉన్నారు. 

ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో రూ. 2 కోట్లకు డీల్

కుదుర్చుకుని, ఏకంగా రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ, పట్టుబడటం ఇదే తొలిసారని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు గిన్నిస్ రికార్డు అధికారులను కోరగా, దాని

ప్రతినిధులు స్పందించారు. 

ఇప్పటివరకూ ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరీ లేదని, దీనికోసం ఓ కొత్త కేటగిరీని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam