DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లల్ని బాలయోగి గురుకుల పాఠశాలలో చదివించండి :

*గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ వై. యశోద లక్ష్మి* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 26, 2020 (డిఎన్ఎస్):* పిల్లల్ని బాలయోగి గురుకుల పాఠశాలలో చదివించాలని శ్రీకాకుళం గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ వై. యశోద లక్ష్మి తెలిపారు. బుధవారం, జలుమూరు మండలం లోని  

అరాసాడ, సవిరిగాం గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. 
బాలయోగి గురుకుల పాఠశాలలో అయిదవ తరగతి లో ప్రవేశం పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై వారికి అవగాహన కలిగించారు. గురుకుల పాఠశాలల లో  అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. అనంతరం జలుమూరు మండలంలో

వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు సమావేశం నిర్వహించడం జరిగింది. బాలయోగి గురుకులాల్లో, వెల్ఫేర్ రెసిడెంట్షియల్ పాఠశాలల లో అయిదవ తరగతిలో అధిక సంఖ్యలో అడ్మిషన్స్ జరగాలి అన్నారు. ఇందుకు  గాను గ్రామాలలో ప్రజలకు ఆన్లైన్ దరఖాస్తుల పై అవగాహన కలిగించాలని తెలిపారు. 
  ఈ కార్యక్రమంలో ఎస్. సి. కార్పొరేషన్ ఈ. డి.

 కె.రామారావు, ప్రిన్సిపాల్స్ మృత్యుంజయ రావు, రామకృష్ణ, ఉషారాణి, దేవేంద్ర, ఎం. ఈ. ఓ. బి. ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam