DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2 న కరోనా నివారణకై విశాఖ లో పాశుపత ధన్వంతరి హోమం 

*పాత్రికేయులు సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పంతో* 

*ఏక కాలం లో కాశీలోనూ, విశాఖలోనూ హోమం నిర్వహణ.*

*కరోనా నిబంధనలతో పాల్గొనండి. భక్తులకు ఆహ్వానం.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 31, 2020 (డిఎన్ఎస్):* ప్రస్తుత మానవాళి జీవనాన్ని అస్తవ్యస్తం

చేస్తున్న కరోనాసురుడి బారినుంచి సమస్త మానవాళి రక్షించబడాలని ఏకైక సంకల్పం తో భాద్రపద పౌర్ణమి ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2 న  త్రిశుల పాశుపత మహా మృత్యుంజయ రుద్ర ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నట్టు చాప చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బాలకృష్ణ తెలియచేసారు. 

కరోనా కష్ట కాలం సైతం ఎంతో ఉన్నతమైన సేవలు

అందించిన పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం తోపాటు, సమాజం లోని వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏక కాలం లో కాశీలోనూ, విశాఖలోనూ ఈ హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

విశాఖ నగరంలోని జాతీయరహదారి పైగల పోర్ట్ ఆసుపత్రి ( తాడిచెట్లపాలెం) ఎదురుగా గల సోనియా గాంధీ కొలని లో ఉన్న శ్రీ

పరదేశి అమ్మ వారి ఆలయం లో జరుగుతుందన్నారు. 
లోక కల్యాణార్థం జరురుగుతున్న ఈ హోమం లో ఆసక్తి ఉన్నవారందరూ కరోనా నిబంధనలకు లోబడి పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కనీస దూరం పాటించాలని సూచించారు. 

పూర్తిగా ఉచితంగా జరిగే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2  న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ

జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు పాల్గొంటారన్నారు. 
ఈ సందర్భంగా వేదవిద్వత్తు కల్గిన బ్రాహ్మణులకు సముచిత రీతిన సత్కరించడం జరుగుతుందన్నారు.  

కరోనా కష్ట కాలం సైతం ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన పాత్రికేయులు, వారి

కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం తో నిర్వహించే ఈ హోమం లో పాత్రికేయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి, ఈ హోమం లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 
ఇతర వివరాలకు చాపా బాలకృష్ణ +91 81254 09699 నెంబర్ ను సంప్రదించవచ్చన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam