DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రణబ్ దా నిష్క్రమణతో దేశం మేధావిని కోల్పోయింది: గంట్ల శ్రీనుబాబు 

*మాజీ రాష్ట్రపతికి పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి నివాళి*

*మాజీ రాష్ట్రపతికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సంతాపం*  

రాష్ట్రపతి హోదాలో 2017 లో ఆయన్ను విజెఎఫ్ బృందం . . .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 31, 2020 (డిఎన్ఎస్):* పాత్రికేయుని స్థాయి నుంచి

ప్రెసిడెంట్ స్థానాన్ని అధిరోహించిన ప్రణబ్ ముఖర్జీ నిష్క్రమణ తో భారతావని ఒక మేధావిని కోల్పోయిందని పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు  అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీ లోని ఆర్మీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆఖరి శ్వాస విడవడంతో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ( వీజేఎఫ్ ) బృందం

దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ భారత దేశం సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ప్రణబ్ ముఖర్జీ ఎంతో సంయమనంతో చాకచక్యంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించేవారన్నారు.   

ఈ సందర్భంగా వీజేఎఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావులు మాట్లాడుతూ అయిదు దశాబ్దాల తన సుదీర్ఘ

ప్రస్తానంలో ప్రణబ్ ముఖర్జీ అజాత శత్రువుగా నిలిచారని కొనియాడారు . తన రాజకీయ జీవితంలో అనేక పదవులను వహించిన ఆయన సామాన్యునిలానే జీవించారని కితాబునిచ్చారు . ప్రధానంగా జర్నలిస్టులు , మీడియా పట్ల ప్రణబ్ అంతులేని అభిమానం చూపేవారని అన్నారు . 

రాష్ట్రపతి హోదాలో ఆయన్ను విజెఎఫ్ బృందం . . .

వీజేఎఫ్

కార్యవర్గంను రాష్ట్రపతి భవనకు 2017 వ సంవత్సరంలో సాదరంగా ఆహ్వానించి సుమారు గంటకు పైగా సమయం వెచ్చించి అనేక సమకాలీన అంశాలను ప్రస్తావించిన సంఘటనను ఈ సందర్భంగా వీజేఎఫ్ కార్యవర్గం గుర్తుచేసుకుంది . జర్నలిస్టులతోనే సమాజాభివృద్ధి సాధ్యమని చెబుతూనే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలని ప్రణబ్

సూచించినట్లుగా పేర్కొన్నారు . ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలను , ఇక్కడి వెనుకబాటుతనంను వినతి పత్రం ద్వారా వీజేఫ్ కార్యవర్గం తెలియజేసినప్పుడు ఎంతగానో సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. 
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల వీజేఎఫ్ కార్యవర్గం తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam