DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏసీబీ అధికారుల పేరుతొ బెదిరింపులు, 6 గురు అరెస్టు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 02, 2020 (డిఎన్ఎస్):*  ఏసీబీ అధికారుల పేరుతొ బెదిరింపులు జరిపిన 6 గురు నిందితులను  కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు అరెస్టు చేసారు. ఈ విచారణ బృందంలో ఒక ట్రైనీ ఐపీఎస్ కూడా ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే. . . , కర్నూలు ల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

కాగినెల్లి ఆదేశాల మేరకు, కర్నూల్ 
ఇంచార్జి డి ఎస్ పి వెంకట రామయ్య పర్యవేక్షణలో, కర్నూల్ 2 వ పట్టణ సి‌ఐ సి. మహేశ్వరరెడ్డి మరియు కర్నూల్ 2 టౌన్ SI U. సునీల్ కుమార్ గారు వారి సిబ్బంది PCs మహీంద్ర, రవి మరియు ప్రియకుమార్ లు కలిసి  కర్నూల్ 2 వ పట్టణ పోలీసు స్టేషన్ Cr.No. 457 / 2020   U/s… 420,120-B, 170, 384,109 r/w 511 IPC కేసులో నమోదైన 6 మంది ముద్దాయిలను

మంగళవారం సాయింత్రం అరెస్టు చేశారు. 
 
ట్రైనీ ఐపియస్ అధికారి  కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ , కర్నూలు పట్టణ ఇంచార్జి డిఎస్పీ వెంకటరామయ్య, కర్నూలు టు టౌన్ సిఐ మహేశ్వరరెడ్డి లు కలిసి నిందితుల వివరాలను విలేకరుల సమావేశం లో బుధవారం  వెల్లడించారు.
 
నిందితుల గురించిన విషయం …..  A1. ఎన్. జయక్రిష్ణ అను అతను

అనంతపురం 3 town పోలీసు స్టేషన్ లో ఏసిం‌బి ఆఫీసర్ ను అని,  ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన  కేసులో అనంతపురం 3 టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిబ్రవరి 2020 లో అరెస్టు కాబడి రెడ్డి పల్లి జిల్లా జైల్, అనంతపురం కు రిమాండ్ పై వెళ్ళినాడు.  అక్కడ పైన తెలిపిన 6 మందిలో 5 గురు విభిన్న నేరాలకు పాల్పడిన వారు, అనగా A2- తమిటిగొల్ల గంగయ్య @ గంగాధర్,

Kadiri Rural P.S., లో మైనర్ అమ్మాయిపై రేప్ కేసులో అరెస్టు కాబడి,  A3-జోలదరాసి సోల్మాన్ రాజు  కనెకల్ పోలీసు స్టేషన్లో మైనర్ అమ్మాయి పై రేప్ కేసులో అరెస్టు కాబడి,  A4. బొడ్డు సాయి కుమార్ బత్తలపల్లి పోలీసు స్టేషన్ లో మైనర్ అమ్మాయి కిడ్నాప్ కేసులో అరెస్టు కాబడి:  A5. నారాయణ స్వామి, హిందూపూర్ 2 టౌన్ పోలీసు స్టేషన్ లో మైనర్ అమ్మాయిపై

రేప్ నేరములో అరెస్టు కాబడి: A6. హోసూరు నారాయణప్ప గోవిందరాజులు అనంతపురం 3 టౌన్ పోలీసు స్టేషన్లో 354 కేసులో అరెస్టు కాబడి  వారలను రెడ్డి పల్లి జిల్లా జైల్ నందు రిమాండ్ పై ఉండగా జయ కృష్ణ  వారితో పరిచయం ఏర్పరచు కున్నాడు. తదుపరి  వారందరూ ఖైదీలుగా ఉంటూ, ఒకరితో ఒకరు స్నేహాన్ని పెంచుకున్నారు. వారి స్నేహంలో భాగంగా ఏ

విధంగానైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

  వీరందరూ బెయిల్ పై బయటకి వచ్చాక ఎన్. జయ క్రిష్ణ  సలహాలతో ఒక గ్రూప్ గా ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ శాఖలలో పనిచేయుచున్న ప్రభుత్వ అధికారులు అనగా గనులు, R& B,  ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మునిసిపాలిటీ, కమర్షియల్ టాక్స్, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల ఫోన్ నంబర్లు

మరియు హోదాను ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్ ద్వారా తెలుసుకున్నారు.

తదుపరి వారందరూ  A6 గోవిందరాజులు ద్వారా కర్నాటక కు చెందిన 6 సిం కార్డ్ తెప్పించుకొని అందులో 3 సిమ్ కార్డ్స్ ద్వారా ఫోన్ లు చేసి, వారిలో మొదటి ముద్దాయి అయిన జయ క్రిష్ణ( ముద్దాయి పరారీలో ఉన్నాడు) విజయవాడ, ఎసిబి హెడ్ క్వార్టర్ నుండి ఏసి్‌బి ఆఫీసర్

గా, రెండవ ముద్దాయి గంగయ్య డి.ఎస్.పి. ఏసిా‌బి గా పరిచయం చేసుకొని మాట్లాడేవారు, మిగిలిన ఏ3 & ఏ4 లు చుట్టుప్రక్కల గమనించేవారు.  

 అవినీతి కార్యకలాపాలు, ఆస్తుల గురించి ఫిర్యాదుల ద్వారా తమకు సమాచారం వచ్చిందన్నారు.  ఇళ్లపై దాడులు  చేసి కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  కేసులు  నమోదు

చేయకుండా ఉంచడం కోసం భారీగా  డబ్బు లు ఇవ్వాలన్నారు. ఈ విధంగా బెదిరిస్తూ ప్రభుత్వ అధికారుల నుంచి అక్రమంగా  డబ్బులు వసూలు చేశారు. 

 ఈ విధంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లోని సుమాయు 70 నుండి 80 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి బెదిరించారు . ఇందులో వైజాగ్, నెల్లూర్, కడప, కర్నూల్ జిల్లాలోని  6 మంది ప్రభుత్వ

అధికారులు ఆయా పరిధులలోని  పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. 

 కర్నూల్ లో ని ఆర్ అండ్ బి శాఖ లో పనిచేయుచున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి నిందితులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.  అతను కర్నూల్ 2 వ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాధు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు  కర్నూల్ 2 వ పట్టణ ఇన్స్పెక్టర్ సి. మహేశ్వర

రెడ్డి, SI-  సునీల్ లు కేసు దర్యాప్తు విచారణ ను వేగవంతం చేశారు. 

 నిందితుల యొక్క ఫోన్ కాల్స్ వివరాలు మరియు ఖాతాల వివరాల ద్వారా ముద్దాయిల ఆచూకిలను కనుగొని, కర్నూలు టు టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

 ఇందులో మొదటి ముద్దాయి అయిన ఎన్. జయ క్రిష్ణ, 8 వ ముద్దాయి అయిన ఉదయ్ కుమార్ అను వారలు ఇంకా అరెస్టు

కావలసి యున్నది. వారికోసం ప్రత్యేక బృందం నియమించబడినది.

 ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి, చేధించిన కర్నూలు టు టౌన్ సిఐ, ఎస్సై మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam