DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులైనా సరే ఈ నాయుడుకి రోజువారీ కప్పం కట్టాల్సిందే . .

*సింహగిరిపై ఇబ్బడిముబ్బడిగా పచ్చ నోట్ల కదలికలు. .. *

*ఈ ఉద్యోగి పనిచేసేది రోజుకు 16 గంటలకు పైగానే*  

*జీతం రూ. 7 వేలే . . ఆదాయం నెలకు ఏడు రేట్లు పైమాటే.*

*ప్రముఖులు వస్తే  పండగే. . . గల్లాపెట్టె ఇట్టే నిండిపోతుంది.*

*విలువైన వస్తువులున్న బీరువాల తాళాలు ఉండేది ఇతని

ఆధీనంలోనే*

*మొత్తం సరిదిద్దెందుకు త్వరలోనే రెగ్యులర్ ఈఓ గా సూర్యకళ. ?*

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో వెలుగు చూస్తున్న విశేషాలకు భక్తులకే కాదు, దేవాదాయ

శాఖా ఉన్నతాధికారులకు సైతం 70 ఎం ఎం సినిమాలే కనపడుతున్నాయి. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులు మూలవిరాట్ కు చెల్లిస్తోంటే. . .అర్చకులు, సిబ్బంది తమ నెలవారీ మొక్కుబడులు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి చెల్లిస్తారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. గర్భాలయంలో విధులు నిర్వహించే అర్చకుల నుంచి, కల్యాణ కట్ట లో విధులు చేసే వారి వరకూ కప్పం

చెల్లించనిదే రోజు గడవదు అనే వ్యాఖ్యలు సింహగిరిపై బహిరంగంగానే వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే. . .

సింహాచలం దేవస్థానం లో ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉద్యోగం చేసే పని గంటలు కేవలం 8 గంటలు మాత్రమే. అయితే నాయుడు అనే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రోజుకు 16 గంటలకు పైగా పని చేస్తూ దేవాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో

నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇతని నియామకానికి సంబంధించి దేవస్థానం ఇచ్చే నెల జీతం కేవలం రూ. 7 వేలే. అయితే. ఇతని పనితనం చూసి దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు (ప్లేట్ కలెక్షన్ లో వాటా) , కేశ ఖండన శాల (భక్తులు ఇచ్చే సంభవనలో వాటా) సిబ్బంది, ఆఖరికి పారిశుధ్య విభాగం సిబ్బంది కూడా ప్రతి రోజూ సంభావనాలు భారీగానే

సమర్పించుకుంటున్నారు. క్షమించాలి వాళ్ళు ఇవ్వడం లేదు, ఈయన తీసుకుంటున్నారు అనాలేమో.  ఈ సంభావనల్లో కొందరు అధికారులకు సైతం ఇతోధికంగా వెళ్తుంది అన్నది దేవస్థానంలో బహిరంగ రహస్యం. 

సాధారణ రోజుల్లో ఇతని ఆదాయం ఏడు రేట్లు పైమాటే  ( అందరికీ సమర్పించుకున్న తర్వాత). కరోనా కట్టడి తర్వాత అన్ని విభాగాల్లోనూ ఆదాయం

తగ్గింది  అనుకుంటున్నప్పడికీ. . ఇతని ఆదాయం లో ఏ మాత్రం మార్పు లేదు అని ఆలయ సిబ్బందే చెవులు కొరుక్కోవడం గమనార్హం. ప్రముఖులు వస్తే  పండగే. . .గల్లాపెట్టె ఇట్టే నిండిపోతుంది. 

విలువైన వస్తువులున్న బీరువాలు తాళాలు ఇతని వద్దే. .

దేవస్థానంలో ఉన్నతాధికారులు, రెగ్యులర్ సిబ్బంది, స్థానాచార్యులు వంటి

పెద్దలు ఉన్నప్పటికీ అత్యంత విలువైన వస్తువులు, బంగారు ఆభరణాల భద్రపరిచే బీరువాలు తాళాలు ఒక కాంట్రాక్టు ఉద్యోగి అయిన ఇతని వద్దే ఉంటాయి అంటే ఇతని హవా ఏ స్థాయిలో ఉందొ తెలుస్తోంది. 

విఐపిలు వచ్చిన సమయాల్లో కండువాలు, స్వామి వారి ఫోటోలు, ఇతర బహుమతులు అందించేది ఇతనే కావడం గమనార్హం. పైగా ఉన్నతాధికారులు సైతం ఇతని

మాటకు కట్టుబడి ఉంటారు అనే వ్యాఖ్యలు దేవస్థానం ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి. 

*ఇతనికి బదిలీయే ఉండదా. . .*

సింహాచలం లో అధికారుల నుంచి క్రింది స్థాయి సిబ్బంది వరకూ అందరికీ విధుల్లో స్దాన చలనం ఉంటుంది. ఈ నిరంతర శ్రామికుడి కి మాత్రం ధ్వజస్తంభం వద్దే దశాబ్డల కాలం నుంచి పోస్టింగ్ ఉంటోంది. దీనిపై

ప్రశ్నించిన వారికి తక్షణం బదిలీ వేటు పడుతుండడం చూస్తే వెనుక అధికారుల ఆశీస్సులు ఏ రేంజి లో ఉన్నాయో తెలుస్తోంది. 

ఈయన దేవస్థాన ప్రతిష్టను పెంచడానికి చేస్తున్న పనుల్లో కొన్ని. .. (ఇవన్నీ కరోనా కట్టడికి ముందు లెక్కలు. ..  కరోనా ఆన్ లాక్ తర్వాత పనులు ఆగలేదు కానీ, ఆదాయం కొంచెం తగ్గింది. అంటే. .

.) 

అర్చకులకు ఎవరైనా సంభావనాలు ఇస్తే. . . తక్షణం వీరి హస్తగతం కావాల్సిందే.

కరోనా ఆన్ లాక్ తర్వాత . . 

కరోనా ఆన్ లాక్ తర్వాత నేడు తీర్థం భక్తులకు ఇవ్వడం లేదు. పైగా శఠారి కూడా లేదు. తీర్ధం ను చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చెయ్యడం, ప్రసాదం తో పాటు కలిపి నేరుగా భక్తులకు సమర్పించుకోవడం, వారి నుంచి

సంభవం పొందడం ప్రత్యేక సదుపాయం గా కలిసి వచ్చింది.

కొబ్బరి కాయలు కొట్టే చోట, తలా నీలాలు సమర్పించే చోట, అన్నప్రసాద సత్రం వద్ద, సెక్యూరిటీ వద్ద, గోశాల వద్ద,  ఇలా కాదేదీ ఆలయాన్ని రక్షించేందుకు కృషి చెయ్యకూడని స్థానం అన్న రీతిలో విశ్వ ప్రయత్నం చేస్తునట్టు సమాచారం. 

తక్షణం ఈ కాంట్రాక్టు ఉద్యోగి ని

స్దాన చలనం కల్గించి, ఇతరులతో సంబంధం లేని విభాగానికి బదిలీ చెయ్యాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

కోసం మెరుపు: దేవస్థానం కోసం ఇన్ని ప్రాంతాల్లో కష్టపడుతున్న ఈ ఉద్యోగి కి ఉన్నతాధికారులు వెసులు బాటు ఇచ్చి , ఇతను ఉద్యోగం చెయ్యవలసిన చోట, మరో వ్యక్తి ని నియమించడం గమనార్హం. 

*త్వరలోనే రెగ్యులర్

ఈఓ గా సూర్యకళ. ?*

సింహాచలం దేవస్థానం లో జరుగుతున్నా అస్తవ్యస్త విధానాలను సరిదిద్దెందుకు రాజగురువు రంగంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ డి ఓ స్థాయి లో విధులు నిర్వహిస్తున్న సూర్యకళను సింహాచలానికి పూర్తి స్థాయి ఈఓ గా తీసుకు వచ్చేందుకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి ఒత్తిళ్లకూ లొంగకుండా

నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటారు అనే పేరు ఉన్న సూర్యకళ వస్తున్నట్టు చూచాయగా తెలియడం తో  దేవస్థానం అధికారుల్లో ఇప్పడికే గుబులు పట్టుకుంది. రాజగురువులు రెండు నెలల చాతుర్మాస్య దీక్ష అనంతరం విశాఖకు వచ్చిన సమయంలోనే ఈమె కూడా భాద్యతలు చేపడతారు అని తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam