DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుద్యోగ యువతకు 10 న ఉద్యోగ నియామక ఎంపిక

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, సెప్టెంబర్ 08, 2020 (డిఎన్ఎస్):*  హనర్ ల్యాబ్, శ్రీసిటీ మరియు గ్రీన్ టెక్ ఇండస్ట్రీలలో ఉద్యోగ నియామకాల కొరకు ఈ నెల 10న ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.నగేష్ పేర్కొన్నారు. ఈ మేరకు

ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ( సిదాప్ ) మరియు జిల్లా  గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా హైదరాబాద్ లోని హనర్ ల్యాబ్, నెల్లూరు లోని శ్రీసిటీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీలలో ఉద్యోగ నియామకాల కొరకు ఈ నెల 10న ఎచ్చెర్ల టి.టి.డి.సిలో ఉదయం 09.30గం.ల

నుండి మధ్యాహ్నం 01.00గం. వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. హనర్ ల్యాబ్ లో పనిచేయుటకు బి.టెక్ కెమికల్ ఇంజినీరింగ్ అభ్యర్ధులకు నెలకు రూ.20 వేలు, బి.యస్.సి పురుష అభ్యర్ధులకు రూ.17 వేల 500 వేతనంతో  పాటు కంపెనీ నిబంధనల మేరకు భోజన సదుపాయం కల్పించబడునని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీ నందు గల మొబైల్ తయారీ కంపెనీలో

పనిచేయుటకు పదో తరగతి పాసై 18 ఏళ్లు పూర్తిచేసుకున్న మహిళా అభ్యర్ధులకు రూ.10వేలు జీతంతో పాటు భోజన, వసతి సౌకర్యం కల్పించబడుతుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు గల గ్రీన్ టెక్ ఇండస్ట్రీలో పనిచేయుటకు బి.టెక్ మెకానికల్ 2017-19 సం.లలో పాసైన పురుష అభ్యర్ధులు, పదో తరగతి, ఇంటర్ , ఐ.టి.ఐ, డిప్లోమాలలో

పాసైన పురుష అభ్యర్ధులకు రూ.10వేల నుండి రూ.12 వేల వరకు జీతంతో పాటు భోజన వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పై ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూనకు హాజరగు అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవపత్రాలతో పాటు బయోడేటా, ఆధార్ కార్డు తప్పనిసరిగా

తీసుకురావాలని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam