DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది ఘటనపై పై సిబిఐ విచారణ జరపాలి 

*విహెచ్పి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్*

(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం) 

విశాఖపట్నం సెప్టెంబర్ 9 2020 (డి ఎన్ ఎస్): తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లోని రథం దగ్ధం సంఘటన పై CBI విచారణ మరియు సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, ఆంధ్రప్రదేశ్

కార్యదర్శి  సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం సంఘటన యావత్ రాష్ట్రంలోని హిందూ ప్రజల హృదయాలను దారుణంగా గాయపరిచిందనీ   ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ
ఈ సంఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,  పోలీసులు వ్యవహరించిన తీరు

భక్తుల మనోభావాలను తీవ్రంగా  గాయపరచాయన్నారు. హిందూ దేవాలయ వ్యవస్థలను పతనం చేయాలన్న రీతిలో సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు హిందూ భక్తులను మరింత కలవరపెడుతున్నాయి.హిందూ దేవాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల మాటలు, చేతలు వారి చిత్తశుద్ధిపై సందేహాలు కలిగించక తప్పదు. రాష్ట్రంలోని ఆలయాలకు రక్షణ కొరవడుతోందన్న

భావం హిందూ భక్తులలో రోజు రోజుకూ పెరుగుతోందన్నారు.
గతంలో  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విగ్రహాల విధ్వంసం, నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క రథం తగలబెట్టడం , పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం లో అమ్మవారి దేవాలయ ప్రవేశ ద్వారం ధ్వంసం చేయడం లాంటి సంఘటనలలో ఎవ్వరినీ శిక్షించకుండా ఈ

పనులన్నీ పిచ్చివాళ్ళ చేష్టలుగా చూపించే ప్రయత్నం చేయడం ఇటువంటి సంఘటనలు పెరగడానికి దోహదపడ్డాయి. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణి ఇటువంటి సంఘటనలకు కారణమన్నది నిర్వివాదాంశం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక ధోరణి పోలీసులను , అధికారులను ఇటువంటి సంఘటనలు

జరిగినప్పుడు చిన్న చిన్న సంఘటనలుగా ,  పిచ్చి వాళ్ళ , ఆకతాయిలపనులుగా చిత్రీకరించేలా ప్రేరిపిస్తున్నాయనీ మండిపడ్డారు.  హిందూ దేవాలయ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించి ఆస్తులను అన్యాక్రాంతం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందను తెలిపారు. 
 
ఇటువంటి సంఘటనలు జరగకుండా

చర్యలు తీసుకోవాలని అభ్యర్థించడానికి వెళ్ళిన హిందువులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నానన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam