DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతదేశంలో కల్చర్, అగ్రికల్చర్ రెండు ఒక్కటే

*అంతర్వేది పై జన సేనాని పవన్ కల్యాణ్* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 9, 2020 (DNS):* మన జీవన విధానంలో, సంస్కృతిలో వ్యవసాయ విధానాలు కూడా భాగమే అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. కాలానుగుణంగా పంటలు ఉంటాయి... ఆ పంటలు చేతికి వచ్చే వేళలోనే పండుగలు చేసుకొంటామన్నారు. మన కల్చర్...

అగ్రికల్చర్ ఒకటే అనే భావనను పెంచుకోవాలని సూచించారు. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన చేపట్టామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జనసేన చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రకృతి రైతు శ్రీ విజయ రామ్ గారు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 
శ్రీ విజయరామ్ మాట్లాడుతూ “భగవంతుడు అందరికంటే పెద్ద సైంటిస్టు అని, మానవ

శరీరంలోని అవయవాల అవసరాలకు తగ్గట్టు విత్తనాలను డిజైన్ చేశాడు. భగవంతుడి సృష్టి చాలా అద్భుతం. మన ఊహకు ఏమాత్రం అందదు. మన శరీరంలో అవయవాల అవసరాలకు తగట్టు ఆహారం ఉంది. మహాభారతం కాలంలో 6 లక్షల విత్తనాలు ఉన్నాయని విజ్ఞులు చెబుతారు. కేవలం ఆకలేస్తే పండించుకొని తినడానికి ఇన్ని లక్షల విత్తనాలు సృష్టించలేదు. మనిషికి భోజనమే ఔషధం

కనుక ఇన్ని లక్షల రకాల విత్తనాలను సృష్టించాడు.  మానవులకు కావలసినవన్ని సృష్టించాకే భూమిపై మనిషిని పుట్టించాడు. మనిషిది భూమి మీద అతిధి పాత్ర. మన ముందు చాలా మంది వచ్చారు... తర్వాత కూడా చాలా మంది వస్తారు. 
దేశంలో మానవ  వనరులకు కొదవ లేదు. కోట్లాది మంది జనాభా ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా పొలాల్లో కలుపు తీయడానికి మనుషులు

లేకుండాపోయారు. దీంతో కలుపు తీయడానికి భయంకరమైన మందులు వాడుతున్నాం. ఏ పంటను వేసినా ఈ కలుపు మందుల ప్రభావం లివర్, బ్రెయిన్ మీద పడి క్యాన్సర్ కు గురవుతున్నాం. ముఖ్యంగా మినుములు పండించడానికి మందులను ఎక్కువగా వాడుతున్నారు. అలా మనం తినే ఇడ్లీల్లోనూ ఆ కలుపు మందుల ప్రభావం ఉంటోంది. కలుపు మందు వాడకుండా పంట పండించుకోవడం

పాలేకర్ విధానంలో చాలా సులభం. ముఖ్యంగా ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఉపాధి హామీ వంటి పథకాలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు లాభం చేకూరుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. వ్యవసాయ కూలీలకు ఇస్తున్న రూ.300 రూపాయల్లో ప్రభుత్వం రూ.150, రైతు రూ.150 భరించవచ్చు. రైతే దగ్గరుండి వ్యవసాయ పనులు పూర్తి చేయించుకొనే అవకాశం వస్తుంది. ఆర్థిక

వెసులుబాటు ఉంటుంది. 

అధిక దిగుబడులవైపు పరుగులు పెట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాం. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో దేశీయ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్ గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏ చిన్న రైతు దగ్గరకు వెళ్లిన 10 రకాల దేశీయ విత్తనాలు లభ్యమవుతాయి. ఇప్పటికీ ఒడిశాలోని పూరి జగన్నాథ్ స్వామి

ఆలయంలో రోజుకు మూడు రకాల వరి విత్తనాలతో భోజనం పెడతారు. రేపు మళ్లీ మరో మూడు రకాల విత్తనాలతో భోజనం వడ్డిస్తారు. ఇలా సంవత్సరంలో దాదాపు వెయ్యి రకాల విత్తనాలతో భోజనం పెడతారు. ఇప్పటికీ దేశంలో 5 వేల రకాల విత్తనాలు బతికే ఉన్నాయి. కొన్ని దేశవాళీ వరి విత్తనాలతో పండించిన ఆహారం తీసుకొనే మహిళల్లో సంతాన సాఫల్యం కలిగే అవకాశం ఉంది.

ఇలాంటివి అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో సైంటిస్టులు చెప్పరు” అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam