DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రాఫిక్ నియంత్రణతో కరోనా కట్టడి :  అడిషనల్ ఎస్పీ 

*Corona be controlled thru traffic restrictions, SKLM Addl SP*

*ట్రాఫిక్ నియంత్రణతో కరోనా కట్టడి :  అడిషనల్ ఎస్పీ* 

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 10, 2020 (DNS):*  శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు అమలు చేసిన ట్రాఫిక్ నియంత్రణ వలన కరోనా కొంతమేర కట్టడి అయినట్లు యస్.ఇ.బి అడిషనల్

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ (ఇన్ ఛార్జ్) కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ట్రాఫిక్ నియంత్రణకు  సహకరించిన వాహన చోదకులకు  ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని జి.టి.రోడ్డు నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు గల సెంటర్ పార్కింగ్ ను యన్.టి.ఆర్.మున్సిపల్ హైస్కూల్

మైదానానికి మార్పు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా ప్రజల రద్దీ బాగా తగ్గిందని, దీంతో కొంతమేర కరోనా కట్టడి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.  నగరంలో ప్రధాన రహదారి అయిన జి.టి.రోడ్డు - ఏడురోడ్ల కూడలిలో  పెద్దఎత్తున వర్తక, వాణిజ్య సముదాయాలు ఉన్నందున  సెంటర్ పార్కింగ్ వద్ద వాహనాలు నిలిపి వేల సంఖ్యలో ప్రజలు

తిరుగుతూ ఉండేవారని, దీంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ గుర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆదేశాల మేరకు కోవిడ్ కేసుల నియంత్రణ మరియు రద్దీ తగ్గించే దృష్ట్యా ప్రస్తుతం ఉన్న సెంటర్ పార్కింగ్ ను ఏడు రోడ్ల కూడలి వద్ద గల యన్.టి.ఆర్.మున్సిపల్ హైస్కూల్ మైదానానికి

మార్పుచేయడం జరిగిందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ విభాగం తీసుకున్న ఈ నిర్ణయంలో భాగస్వాములైన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam