DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది ఘటనపై దూషణలు చెయ్యవద్దు: యామిజాల 

*నిరసనలు శాంతియుతంగానే చెయ్యాలని పిలుపు* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 11, 2020 (DNS):* తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మహా రథం తగులబడిపోవడం అత్యంత దారుణమైన సంఘటన అని, ఇటువంటి సమయంలో పురోహితులు అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు సంవయనం

పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేసి ఇబ్బందులకు గురికావద్దని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహా మూర్తి ఒక ప్రకటనలో తెలియచేశారు.

ఇటీవల వరుసగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు రాష్ట్రంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాలను తెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు,

ప్రధానంగా అర్చకులు పురోహితులు జరుగుతున్న పరిస్థితులకు భయబ్రాంతులకు గురౌతున్నారన్నారు.

వీటిపై విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు కూడా ఆవేదన వ్యక్తం చెయ్యడం, సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచన చెయ్యడం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అనేక శాంతియుత ధర్నాలు

విజ్ఞాపనలు చెయ్యడం, అంతేకాకుండా ఎండోమెంట్స్ రీజియన్ కమిషనర్ భ్రమరాంబ ను రాష్ట్ర నాయకులు, తూర్పుగోదావరి జిల్లా నాయకులతో కలిసి అంతర్వేదిలో వినతిపత్రం సమర్పించడంతో ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా పారదర్శకంగా విచారణ జరిపించాలని ఏ రాజకీయ కోణం ఉండకూడదని, ఇంత దారుణానికి వడిగట్టిన దోషులను గుర్తించి కఠినంగా

శిక్షించాలని ఈ కేసుని కేంద్ర CBCID కి అపోతాగించడం స్వాగతిస్తున్నామని తెలియచేశారు.

తొందరపడి కొందరు సోషల్ మీడియాలలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం వంటివి కూడా ప్రమాదకారకంగా వుంటాయని ఇటువంటి విపత్కర దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు పురోహితులు, అర్చకులు మరింత అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని

తెలియచేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం తో కేంద్ర నిఘావర్గాలు అంతర్వేదిలో రథం దమనకాండ దోషులనే కాక ఇప్పటివరకు హిందూ దేవాలయాలపై జరిగిన దాడిలో సంబంధాలు ఉన్న దోషులు కూడా గుర్తించే అవకాశం ఉంటుందని యామిజాల ఆశాభావం వ్యక్తం చేసారు. శుక్రవారం భీమవరం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

ఆళ్ల కాళీ కృష్ణ యామిజాలని కలసి మాటవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని గుర్తించడానికి సహకరించాలని తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల యాభైవేలు మంది అర్చకులు పురోహితులు ఉన్నామని, ప్రభుత్వానికి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని,

త్వరలోనే దోషులను గుర్తించి వారికి కఠినంగా శిక్షలు పడేలా ప్రతీరోజూ నిత్యానుష్టానంలో పూజలు చేస్తామని యామిజాల తెలియచేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam