DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార్య మాతృమూర్తి.. (అలివేలు ) అమ్మగారికి అశ్రుతాంజలి .

*యతీశ్వరులకైనా మాతృ సంబంధం విడదీయరానిది.*

*మాతృమూర్తికి త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆఖరి అంజలి.* 

*వైదిక సమాజ ఉద్ధరణకు శ్రీకారం చుట్టారు. . ధన్యోహం. : DNS..*  

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2020 (డి ఎన్ ఎస్):* దేశ విదేశాల్లోసైతం విశిష్టాద్వైత

సంప్రదాయాన్ని విస్తృతంగా అందించి, ఎన్నో వందల యజ్ఞ యాగాది క్రతువుల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి, అపరరామానుజులుగా కొనియాడబడుతున్న త్రిదండి చిన్న జీయర్ స్వామి తమ మాతృమూర్తి విద్వన్మణి అలివేలు మంగమ్మకు శనివారం ఆఖరి అంజలి అర్పించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె పరమపదానికి

చేరుకోవడంతో యావత్ వైష్ణవ గోష్ఠి దిగ్బ్రాంతి కి లోనైంది. 

భారతీయ ఆధ్యాత్మిక రంగంలో అత్యంత ప్రభావితమైన మహానీయులను అందించినవారు ఎందరో ఉన్నారు. సుమారు వెయ్యి ఏళ్ళ క్రితం భక్తి ఉద్యమం విస్తృతంగా సాగిన సమయంలో ఆది శంకరాచార్యులు, భగవద్రామానుజులు, మధ్వాచార్యులు లాంటి ఎందరో మహనీయులు భారతీయుల జీవనాలను

సన్మార్గంలో నడిపించారు. తదుపరి కాలంలో ముష్కరుల దండయాత్రలతో భారతీయ హైందవ సమాజం అస్తవ్యస్తమవుతున్న సమయంలో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు సక్రమం చేసేందుకు కృషి చేసారు.  

మహనీయుల మార్గాన్ని కొనసాగించేందుకేనా అన్నట్టుగా 1979 లో ఈ లోకానికి శ్రీమన్నారాయణ అనే యువకున్ని సమాజం కోసం అపరరామానుజులుగా అందించిన

విద్వన్మణి అలివేలు మంగమ్మ కు యావత్ హైందవ సమాజం నేడు అంజలి ఘటిస్తోంది. 

ఇంటికి పెద్దవాడైనా. . సమాజం కోసం. ..

ఆధ్యాత్మిక పరంగా సమాజాన్ని మరింత చైతన్యపరచాలని ఏకైక సంకల్పంతో చిన్న పిల్లలతో ఉన్న తమ కుటుంబానికి ఆధారమైన 21 ఏళ్ళ తన పెద్ద కుమారునికి సన్యాసాశ్రమం స్వీకారానికి అంగీకరించేవారు ఎవ్వరూ ఉండరు.

అలాంటిది కుటుంబం శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యం అని భావించి ఈమె, శ్రీమన్నారాయుణునిగా ఉన్న పిలువబడుతున్న తన పెద్ద కుమారుణ్ణి త్రిదండి చిన్న జీయర్ స్వామిగా అఖండ భారవానికి అందించిన మహనీయులు. నాటి పరిస్థితుల్లో ఆమె సైతం ఊహించి ఉండరు, ఈ యువకుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి మరో రామానుజులు అవుతారు అని. 
అనంతరం

ఎన్నో సందర్భాల్లో కష్ఠాలను సైతం తనలోనే దాచుకుని, పిల్లల ఎదుగుదలకు కృషి చేసి ఉంటారు. నాడు సన్యాసం తదుపరి తల్లి ఎదురుగా కనిపించినా అందరి లాగానే చూడాలి తప్ప ఎటువంటి ఆప్యాయత ప్రదర్శించే అవకాశం ఉండదు. 

మాతృ సంబంధం విడదీయరానిది : . . . . .

సన్యాసాశ్రమం స్వీకరించి, సామాన్య జీవనానికి దూరంగా ఉండే

 యతీశ్వరులకైనా మాతృ సంబంధం ఎన్నటికీ విడదీయరానిది. యతీశ్వరులు, పీఠాధిపతులు వారికి జన్మ ఇచ్చిన తల్లి ఎదురైతే తప్పని సరిగా ప్రణామం చెయ్యాల్సి ఉంటుంది. ఇదే భారతీయ సనాతన హైందవ ధర్మం తెలియచేస్తోంది. దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక రంగంలో అగ్ర శిఖరానికి చేరుకున్న ఆది శంకరుల సైతం తన తల్లి ఆఖరి ఘడియల్లో చేరుకొని ఆమెకు

అంత్యేష్టి నిర్వహించినట్టుగా చరిత్ర తెలియచేస్తోంది. 

ఆధ్యాత్మికంగా యావత్ ప్రపంచాన్ని చైతన్యం కలిగిస్తున్న జీయర్ స్వామి ఎదుగుదలకు ఆమె ప్రోత్సాహం అణువణువునా కనిపిస్తూనే ఉంటుంది. సామాన్య యువకుని నుంచి అసామాన్య ఆధ్యాత్మిక వేత్తను అందించిన మహనీయులకు పరమపదంలో నిత్యా స్థానం ఏనాడో భద్రపరచబడి ఉంటుంది

అని పెద్దలు వెల్లడిస్తుంటారు. 

అవసరమైన ప్రతి సందర్బంలోనూ తమ తల్లి వైభవాన్ని, ఆత్మీయతలు స్వామిజి తెలియచేస్తూనే ఉంటారు. ఒక తల్లి ఎలా ఉండాలి, పిల్లల పట్ల ఎంత భాద్యతతో వ్యవహరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అనే అంశాలను వివరించి, ఆధునిక యువతకు జాగ్రత్తలు తెలియచేస్తుంటారు. 

ఎన్ని

విమర్శలు వచ్చినా. .అంతర్మథనమే. . . .

యువకుడైన కుమారుడు సన్యాసాశ్రమం స్వీకారం చేసిన తదుపరి దేశవ్యాప్త పర్యటనలో వీరి ప్రమేయం లేకుండా జరిగే సంఘటనల వలన జీయర్ స్వామి పై వచ్చే వ్యతిరేక వ్యాఖ్యల పట్ల ఈమె అంతర్మథనమే పడ్డారు తప్ప, ఎక్కడా బహిర్గతం చేసేవారు కాదని ఆశ్రమ నివాసులు తెలియచేస్తుంటారు. అయితే తమ సంకల్ప బలం,

పెద్దల ఆశీర్వద బలం ఎంతో గొప్పదని విశ్వసించే వీరు, ఎన్నడూ ఒక్క ప్రశ్న కూడా వెయ్యక పోవడం గమనార్హం. 

చాలా ఏళ్ళు . .. దర్శనమే లేదు. . .

సన్యాసం దీక్ష లో ఉన్నవారికి కుటుంబ సభ్యులు ఎదురైతే దీక్ష భంగం కలుగుతుంది అనే ఉద్దేశంతో చాలా కాలం స్వామిజి తో కుటుంబసభ్యులు కలిసిన దాఖలాలు లేవు. ఈ కాలం లోనే జీయర్ స్వామి

విశిష్టాద్వైత ఉద్యమాన్ని పూర్తి స్థాయి లో విస్తరింప చేసి, ఎందరో యువకులను, ఆధ్యాత్మికవేత్తలను సైతం ప్రభావితం చేశారు. దీనికి నిదర్శనమే నేడు యతీశ్వరులుగా సన్యాసం చేపట్టడానికి చిన్న జీయర్ స్వామి ఉద్యమమే. వీరి ఆశ్రమ నిర్వహణలో ఎందరో జీయర్లు, పీఠాధిపతులు తో ఆధ్యాత్మిక అంశాలు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్య

నిపుణులతో ఆధునిక అంశాలు నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. 

ప్రస్తుతం శంషాబాద్ లోని జీయర్ ఆశ్రమం ప్రాంగణంలోనే వీరు కూడా ఉండి, స్వామిని సేవిస్తూ, ఆశ్రమం లో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీయర్ స్వామి ని దర్శించిన వారు, వారి మాతృమూర్తిని దర్శించకుండా ఆశ్రమం నుంచి వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు.

 

వైదిక సమాజ ఉద్ధరణకు శ్రీకారం చుట్టారు. . ధన్యోహం.  

వేలాది మందికి మంత్రోపదేశం అనుగ్రహించి, వారికి సన్మార్గాన్ని తెలియచేసి, మానవ జీవనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రపంచానికి మహానీయులను అందించి, సమాజ శ్రేయస్సు లో తనవంతు పాత్ర పోషించిన మహనీయురాలు మాతృశ్రీ కి  అనేక 
DNS కుటుంబం తరపున

దాసోహములు సమ్పరిస్తున్నాం. 
 - DNS .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam