DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ విధానాల వల్లే అంతర్వేదిలో రధం దగ్ధమైంది:  మాజీఎంపీ తోట

*ఏపీ లోని అన్ని ఆలయాలపైనా సిబిఐ విచారణ చెయ్యాలి*

*మాజీఎంపీ, తోట సీతారామలక్ష్మి మండిపాటు.* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 12, 2020 (DNS):* తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయ ఘటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలే కారణమని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ

అధ్యక్షురాలు మరియు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి చెందిన రధం ఈనెల 5 న శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాలి బూడిదైన ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఏటా రధోత్సవం

రోజున ఈ రధాన్ని ఉపయోగిస్తారని, రూ. 94లక్షలు ఖర్చుతో పూర్తి టేకు కలపతో ఈ రధాన్ని 67 ఏళ్ల క్రితం తయారు చేశారన్నారు. ఏటా రధోత్సవం స్వామివారి ఊరేగింపును తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతున్నారని, దగ్ధానికి మొదట షార్ట్ సర్క్యూట్ అన్నారన్నారు. అయితే అక్కడ కరెంటు కనెక్షన్ లేదని తేలిన తర్వాత పిచ్చివాడి మీదకు నెట్టేశారు.

అది కూడా తప్పని తేలిన తర్వాత తేనెతుట్టె మీదకు నెపం మోపెసారన్నారు.  

సంఘటన జరిగిన వెంటనే ఘటన స్థలానికి నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు లను చంద్రబాబు పంపడం జరిగిందన్నారు. పరిశీలించిన తరువాత సీబీఐ ఎంక్వయిరీ కోరడం జరిగిందని, ఇక్కడ ఒక్క అంతర్వేది లోనే కాదు ఇతర అన్ని

ఆలయాలపైనా, పూజారులపైన, సింహాచలం ఇసుక కుంభకోణం, ఆలయ భూముల కుంభకోణాలపైనా సీబీఐ విచారణ జరపాలన్నారు. గత 16నెలల కాలంలో హిందూ దేవాలయాలపై వరుస విధ్వంసాలు జరుగుతున్నాయి. బిట్రగుంట లో రధాన్ని తగులబెట్టారు, పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం తిరుమల పవిత్రతను దెబ్బతిస్తున్నారు. ఆలయ భూములను విక్రయించేందుకు కుట్ర పన్నేరు, టీటీడీలో

అన్యమత వారి నియామకాలు జరిగాయన్నారు. 
తిరుమల లడ్డును అంగడిలో సరుకులు అమ్మినట్లు అమ్మడం, టీటీడీ వెబ్ సైట్లో యేసు బోధనలు, ఫోటోలు ఉంచడం. ఎస్వీ బిసి చైర్మన్ గా పృధ్వి రాజ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. టీటీడీ నిధులను దారి మళ్లించారు. శ్రీశైలం కొండ మీద 200పైగా చర్చిలు వెలిశాయి. సింహాచలం భూములలో అక్రమ మైనింగ్, ఆస్తుల

కుంభకోణం, ట్రస్ట్ లో అన్యమతస్థులు నియామకం వంటి ఘటనలు జరిగాయి. 
సింహాచలం భూములలో చర్చిలు కట్టారు. అర్ధరాత్రి 5జీవోలు ఇచ్చి ట్రస్ట్ చైర్మన్ గా సంచయితను నియమించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెంలో గుడిపై డాడీ చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరుసటి రోజు బుట్టాయిగూడెం మండలం కేంద్రంలో మరో

ఆలయంలో విగ్రహాలను దెబ్బతీశారు. ఈ రెండు కేసుల్లో దోషులెవ్వరో ఇప్పటికి తేలలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలో అమ్మవారి దేవాలయం ముఖా ద్వారం కూల్చేశారు. గుంటూరు నగరంలో ఆదిశక్తి ఆలయాన్ని హుటాహుటిన కూల్చేశారు కనీసం విగ్రహాలను తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. 
కాణిపాకం దేవస్థానానికి

చెందిన సత్రాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఉన్న విజయేశ్వర స్వామి గుడి కూల్చేశారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని కూల్చేశారు. ద్వారకా తిరుమల

దేవాలయ ఆస్తుల విక్రయాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నిధులను మళ్లించడంలాంటి అనేక హిందూ ధర్మాన్ని కించపర్చేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని అన్నారు. ఈ 16నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంస ఘటనలు, అక్రమాలపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అంతర్వేది రధం దగ్ధం ఘటనపై న్యాయం చేయాలి అని డిమాండ్ చేసిన వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam