DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Pipe Line Infra gestures PPEs, masks to GGH Kakinada

*సిఎస్ఆర్ లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి అందజేత* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, రాజమండ్రి )* 

* రాజమండ్రి /విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2020 (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కు చెందిన మెజర్స్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సామాజిక భాద్యత సేవా కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీఈ

కిట్లు, మాస్కులను అందించింది. శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమం లో పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ప్రాంతీయ మేనేజర్ ఎన్ సి హెచ్ రామనర్సింహం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా 635 పీపీఈ కిట్లు, 830 సర్జికల్ మాస్కులను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అందించడం జరిగిందన్నారు. ఏటా తమ సంస్థ పలు సామాజిక

కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నిత్యం వైరస్ అదుపుకు పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ ల తో పాటు అత్యంత సురక్షితమైన మాస్కు లను ప్రభుత్వ ఆసుపత్రి సూపరెంటెండెంట్ డా. ఎం. రాఘవేంద్ర రావు, సహాయ వైద్య అధికారి గిరిధర్ లకు అందించడం జరిగిందన్నారు. 


కార్యక్రమం లో పైప్ లైన్ సంస్థ జనరల్ మేనేజర్ బాజివాలి, సిబ్బంది ధర్మారావు, ప్రమోద్ పాండా లు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam