DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి కి చేరుకున్న పిచ్చొళ్లా మతోన్మాదుల పైశాచికత్వం

*రాజమండ్రి లో ఇంటి ముందు గణేష్ విగ్రహంపై మలం పూసిన వైనం*

*ఆలస్యంగా కళ్లుతెరిచిన యంత్రాంగం, బొమ్మూరు పోలీసులు దర్యాప్తు*  

*హంగామా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు.*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 12, 2020 (DNS):* ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవీదేవతలు పై మతోన్మాదుల

దాడులు ప్రతి జిల్లాలోనూ పెట్రేగిపోతున్నాయి. ఇప్పడికే చాలా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దహనకాండలు చేస్తున్న పిచ్చెక్కిన మతోన్మాదుల పైశాచికత్వాలు ఇక నేరుగా హిందువుల ఇళ్లపై పడ్డాయి.  అంతర్వేది ఆలయ రధం నేరుగా దహనం చేసిన ఘటన విషయం లో దోషులు తేలకుండానే రాజమండ్రి లో ఏకంగా ఒక ఇంటి ముందు గణేశా విగ్రహం పై మలం పూసి మత

పిచోళ్లు ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గ్రామమైన పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరిలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానిక సరస్వతి  స్కూల్ సమీపంలో ఉన్న వీధిలో  ప్రసాద్ బాబు ఇంటి సమీపంలో ఉన్న వినాయక విగ్రహానికి శుక్రవారం అర్ధ రాత్రి అన్యమత

మతోన్మాదులు, పీఛెక్కి,  మలం పూసీ  పరారయ్యారు. ఇదే జిల్లాలో జరిగిన ఘటనను గుణపాఠంగా నేర్చుకొని అధికార యంత్రంగా ఆలస్యంగా నిద్ర లేచింది. 
శనివారం ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు విగ్రహం వద్ద అపచారం జరిగి ఉండడం చూసి ఆవేదనకు గురయ్యారు. ఆలస్యంగా రంగంలోకి దిగిన పొలిసు యంత్రాంగం విచారణ చేసేందుకు

సిద్ధమైంది. 

హంగామా ప్రచారం చేస్తే కఠిన శిక్షలు: పోలీసులు 

 దేవతా మూర్తి కి అపచారం జరిగిన ఘటనపై పై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని డి.ఎస్.పి  ఏ. టీ. వి. రవికుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం బొమ్మూరు ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి తో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు.

ఘటనా స్థలి  సమీపంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నేర చరిత్ర గల ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.  జరిగిన ఘటన మతపరమైన సున్నిత అంశం కాబట్టి సంయమనం పాటించాలని కోరారు.  సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు,  ఉద్రేకపూరితమైన అంశాలు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam