DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని పీడిస్తున్న రాక్షసుడు చంద్రబాబు ప్రమాదకారి

*టీడీపీ హయాంలో  40 గుళ్లే కూల్చేస్తే నోరెత్తలేక పోయారు.*
 
*అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం*

*ఆలయాల వద్ద భక్తులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించం*

*టీడీపీకి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరిక*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 12, 2020 (DNS):*

 దేవాలయాలను రాజకీయాలకు ఉపయోగించుకునే నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు అని, రాష్ట్రానికి రాక్షసుడిలా పట్టిపీడిస్తున్నాడని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా 40 ఆలయాలు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగేసి, దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేయించిన చంద్రబాబు.. నేడు హిందుత్వం గురించి

మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు హిందూమతం మీద ఎంత నమ్మకం ఉందంటే.. రామోజీరావు దగ్గరకు వెళ్లినప్పుడు బూట్లు తీసేసి వెళ్తాడు. దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుంటాడు. ఇది హిందూమతంపై చంద్రబాబుకు ఉన్న గౌరవమని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కె.పెంటపాడులో శ్రీగోపాలస్వామి ఆలయ

దివ్యరథం చంద్రబాబు హయాంలో దగ్ధమైందన్నారు. దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదని, బాధ్యులను ఎందుకు గుర్తించలేదని చంద్రబాబు, బీజేపీ, జనసేన పార్టీలను ప్రశ్నించారు. 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ.. ‘‘రథాలు తగలబడటం దురదృష్టకరమైన సంఘటన. 2017 అక్టోబర్‌ 19న పశ్చిమ గోదావరి జిల్లా కె.పెంటపాడులో శ్రీగోపాలస్వామి ఆలయంలో 70 ఏళ్ల చరిత్ర గల రథం చంద్రబాబు హయాంలో బీజేపీ నాయకుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఈ ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామ్యం. దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కొద్ది దూరంలో జరిగిన ఘటన

ఇది. 
దీనిపై చంద్రబాబు, బీజేపీ, జనసేన ప్రశ్నించలేదు. వైయస్‌ఆర్‌ సీపీ కూడా రాజకీయాలు చేయడం ఇష్టం లేక స్పందించలేదు. కేవలం సాయంత్రం 5:22 గంటల నుంచి రాత్రి 7.07 గంటల వరకు సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఈవోను, ఏ ఒక్క అధికారిపై చర్య తీసుకున్న పరిస్థితి లేదు. కేవలం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి ఘటనను భూస్థాపితం చేశారు. 
/> చంద్రబాబుకు దగ్ధం చేయడం, కాల్చడం చాలా సరదా. తుని రైలు, రాజధాని రైతుల పొలాలు, 2017లో రథం ఘటన నిదర్శనాలు. రథానికి సంబంధించి పునర్‌నిర్మించేందుకు ఒక్క రూపాయి ప్రభుత్వం కేటాయించలేదు. స్థానికులంతా కలిసి సుమారు రూ.30 లక్షలు పోగుచేసుకొని రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది వాస్తవమా.. కాదా..? ఆరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు,

దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పటి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న జనసేన పార్టీ చెప్పాలి. దీనిపై ఎవరూ స్పందించలేదు.
ఒక తప్పిదం చేస్తే ఈ ప్రభుత్వంలో హిందువులపై దాడి జరిగిందని బురదజల్లుతున్నారు. దయచేసి సోషల్‌ మీడియాలో చంద్రబాబు పోస్టులు నమ్మకండి. అవన్నీ అభూత కల్పనలు. అంతర్వేది ఘటన నిగ్గుతేల్చాలని

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీబీఐకి అప్పగించారు. 2017లో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా రాజీనామా చేస్తారా..? బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయన పదవికి రాజీనామా చేస్తారా..? పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలు వదిలేస్తారా..? 
చంద్రబాబుకు హిందూమతం మీద ఎంత నమ్మకం ఉందంటే.. రామోజీరావు దగ్గరకు

వెళ్లినప్పుడు బూట్లు తీసేసి వెళ్తాడు. దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుంటాడు. ఇది హిందూమతంపై చంద్రబాబుకు ఉన్న గౌరవం. అదే విధంగా కామినేని శ్రీనివాసరావు కూడా బూట్లు వేసుకొని పూజలు చేస్తారు. వీళ్లు హిందువులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. 
చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఎన్ని గుళ్లకు

వెళ్లినా పాపాలు పోవు. అంత దుర్మార్గుడు చంద్రబాబు. టీడీపీ నేతలు గుళ్లలో పూజలు చేసి నిరసన తెలియజేయాలంట. ఏ గుడిలోనైనా శాంతిభద్రతల సమస్య వచ్చినా, భక్తులకు ఎటువంటి ఆటంకం కలిగించినా ఉపేక్షించే పరిస్థితి లేదు. దేవాలయాలను రాజకీయాలకు ఉపయోగించుకునే నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు, ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు.

చంద్రబాబు చేసిన తప్పులకు శిక్ష అనుభవించేందుకు నరకం కూడా చిన్నదే’’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam